న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ ముగిసింది. గంటపాటు జరిగిన ఈ భేటీలో ఎన్నికల ఫలితాలు, ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం అనుసరించాల్సిన వ్యూహాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై చర్చలు జరిగినట్టు సమాచారం. ప్రధానంగా కేంద్రంలో బీజేపికి అధికారం రాకుండా ఉండేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోన్న చంద్రబాబు.. ఒకవేళ బీజేపీకే మెజారిటీ దక్కితే అనుసరించాల్సిన ప్లాన్ ఏ వ్యాహాలు, లేదంటే బీజేపికి వ్యతిరేక పవనాలు వీస్తే అనుసరించాల్సిన ప్లాన్ బి వ్యూహాలపై రాహుల్ గాంధీ, చంద్రబాబు మధ్య చర్చ జరిగినట్టు మీడియాలో వార్తా కథనాలు వెలువడుతున్నాయి.
ఇదిలావుంటే, రాహుల్ గాంధీతో భేటీ అనంతరం చంద్రబాబు వెళ్లి సోనియా గాంధీతోనూ భేటీ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.