Hair Growth Tips: జుట్టు రాలడం.. అతిపెద్ద ప్రధాన సమస్యగా మారిపోయింది. అయితే మనం కేర్ తీసుకోకపోవడం వల్ల.. జుట్టు అధికంగా రాలిపోతుందని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆహారాలతో పాటు వాతావరణం కూడా మన జుట్టును ప్రభావితం చేస్తుంది. ఒకవైపు రుతుపవనాలు, మండుతున్న వేడి, అధిక వర్షాల కారణంగా కూడా జుట్టు రాలడమే కాదు జుట్టు సంబంధిత సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి.
ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం కూడా ఎక్కువగా వస్తున్న విషయం తెలిసిందే... మరి మారుతున్న వాతావరణం వల్ల ఈ సమస్య రెట్టింపు అవుతుంది. ఈ సీజన్లో ఎక్కువగా చెమట పట్టడం వల్ల కూడా జుట్టు జిడ్డుగా కనిపిస్తుంది. తేమ మూలాల నుండి జుట్టును బలహీనపరిచి.. వేగంగా రాలిపోవడానికి కారణం అవుతుంది. అందుకే ఈ సమస్య నుంచి బయటపడడానికి అమ్మాయిలు ఖరీదైన చికిత్సలను చేయించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు... అయితే దీనివల్ల కొంచెం జుట్టు రాలడం తగ్గుతుంది.. కానీ శాశ్వతంగా కాదని చెప్పాలి.
ముఖ్యంగా మార్కెట్లో దొరికే ఉత్పత్తుల వల్ల కూడా జుట్టు రాలే సమస్య అధికమవుతుంది. వీటి తయారీలో హానికరమైన రసాయనాలు కూడా ఉంటాయి. ఇవి జుట్టును పొడిగా నిర్జీవంగా మారుస్తాయి. ఇక షాంపూలు.. నూనెలు ఇలా ఎన్ని వాడినా సరే జుట్టు రాలడం ఆపలేము. అలాంటివారు ఇంటి చిట్కాలను ఆశ్రయించాల్సి ఉంటుంది. ఇంటి చిట్కాలు మనకు ఆరోగ్యానికి ఆరోగ్యం అందివ్వడమే కాదు జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తాయి. మరి జుట్టు రాలకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
మెంతి గింజలు..
జుట్టు రాలడాన్ని ఆపి.. ఆరోగ్యంగా పెరగడానికి చాలా చక్కగా సహాయపడతాయి. కొబ్బరి నూనెలో మెంతి గింజలను వేయించి.. నూనె చల్లారిన తర్వాత వడగట్టి ఆ నూనెను జుట్టుకు, మాడుకు అప్లై చేస్తే జుట్టు కుదుళ్ళు బలపడి ఒత్తుగా, బలంగా జుట్టు తయారవుతుంది. అంతేకాదు ఈ మెంతి గింజలు మీ జుట్టును ఎక్కువ కాలం నల్లగా ఉంచడంలో సహాయపడతాయి. ఇకపోతే రాత్రి సమయంలో మీకు సమయం ఉంటుంది అంటే మెంతి గింజలను కొబ్బరి నూనెలో వేడి చేసి.. చల్లారిన ఆ నూనెను జుట్టుకు పట్టించి.. రాత్రంతా ముడి వేసి ఉంచాలి. ఉదయాన్నే జుట్టును షాంపూతో తల స్నానం చేస్తే.. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడమే కాదు మెరుస్తూ ఉంటుంది.
ఉల్లిపాయ రసం:
ఉల్లిపాయ రసం కూడా జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది అనేక జుట్టు సంరక్షణ ఉత్పత్తులలో ఉపయోగిస్తారు.. ఉల్లిపాయ రసం జుట్టు రాలడాన్ని అరికట్టడమే కాదు రెట్టింపు వేగంతో జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఉల్లిపాయ రసాన్ని , కొబ్బరి నూనెతో కలిపి వారానికి ఒకసారి తలకు పట్టించి..ఆ తర్వాత తలస్నానం చేయడం వల్ల జుట్టు సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Hair fall solution: జుట్టు అధికంగా రాలుతోందా.. సింపుల్ చిట్కా మీకోసం..!