Kalki 2898 AD: నాగ్ అశ్విన్ .. కల్కి సినిమాను మన పురాణ ఇతిహాసాలకు సైన్స్ ఫిక్షన్ జోడించి ‘కల్కి 2898 AD’ సినిమాను తెరకెక్కించారు. భవిష్యత్తులో మన ప్రపంచం ఎలా ఉండబోతుందో ఊహించుకొని కల్కి చిత్రాన్ని తెరకెక్కించాడు. ముఖ్యంగా ప్రపంచంలో చివరి పట్టణమైన కాశీని చూపించడంతో పాటు .. కాంప్లెక్స్, శంబాలా అనే మరో రెండు కొత్త ప్రపంచాలను ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు. ముఖ్యంగా మహా భారత యుద్ద కాలం నుంచి 6 వేల యేళ్ల తర్వాత జరిగిన ఇతివృత్తాన్ని కల్కి మొదటి పార్ట్ లో చూపించాడు. ఇక రెండో పార్ట్ కు ‘కల్కి 3102 BC’ అనే టైటిల్ అనే ప్రచారం సాగుతుంది. అయితే.. ఈ సినిమాలో నాగ్ అశ్విన్..క్లైమాక్స్ లో ప్రభాస్ ను ‘కర్ణుడి’ పాత్రలో చూపించాడు. అదే ఈ సినిమాలో పెద్ద బ్లండర్ మిస్టేక్ అని చెబుతున్నారు పండితులు.
కర్ణుడు అంటేనే సహజ కవచ కుండలాలతో సూర్య వర ప్రసాదంగా కుంతీకి పుట్టిన మొదటి సంతానం. అయితే.. యుద్దానికి ముందు అర్జునుడి విజయం కోసం ఇంద్రుడు .. ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి కర్ణుడి నుంచి ఆయనుకున్న సహజ కవచ కుండలాలను దానం గా అడుగుతాడు. అయితే.. కర్ణుడు ఎలాంటి సంకోచం లేకుండా.. తన ఒంటిపై ఉన్న కవచ కుండలాను దానం చేసేస్తాడు. అయితే.. కల్కి సినిమాలో ప్రభాస్ ను కర్ణుడి చూపించినపుడు.. అది యుద్ధ రంగంలో కర్ణుడిని కవచ కుండలాలతో చూపించడాన్ని తప్పు పడుతున్నారు పండితులు.
యుద్ధ సమయంలో .. మహా భారతంలోని కర్ణ పర్వంలో కర్ణుడు యుద్ధ రంగంలో ప్రవేశిస్తాడు. ఆ సమయంలో కర్ణుడికి ఎలాంటి కవచ కుండలాలు ఉండవు. ఈ విషయాన్ని నాగ్ అశ్విన్ గుర్తు పెట్టుకొని ఉంటే బాగుండేది పండితులు చెబుతున్నారు. మొత్తంగా ‘కల్కి’ సినిమాతో పండితుల నుంచి పామరుల వరకు అందరి దృష్టిని నాగ్ అశ్విన్ ఆకర్షించడం విశేషం. మొత్తంగా ‘కల్కి’ సినిమా పూర్తిగా కాల్పనికంగా తెరకెక్కించిన నాగ్ అశ్విన్.. మహా భారతంలోని మహారథుడైన కర్ణుడి పాత్రను అలా చూపించడాన్ని తప్పు పడుతున్నారు. అయితే.. యుద్ధ సమయంలో అందరు యోధులు కవచాలు ధరించడం సర్వసాధారణం. అలా కర్ణుడి పాత్ర యుద్ధం సందర్భంగా కవచాలను ధరించినట్టు చూపించాడా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఏమైనా ‘కల్కి’ సినిమాతో నాగ్ అశ్విన్ టాక్ ఆఫ్ ది ఇండియన్ ఇండస్ట్రీగా మారారు.
Also Read: Hyderabad T Square: న్యూయార్క్‌ను తలదన్నేలా హైదరాబాద్‌లో భారీ నిర్మాణం.. ప్రపంచస్థాయిలో టీ స్క్వేర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Kalki 2898 AD: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!