Chikkadapally Library: తెలంగాణలో నిరుద్యోగుల పోరాటం తీవ్రమవుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని వారాలుగా జరుగుతున్న పోరాటం కొనసాగుతోంది. తాజాగా వారి ఉద్యమం సోమవారం రాత్రి ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్ చిక్కడపల్లిలోని సెంట్రల్ లైబ్రరీ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. కనిపించిన నిరుద్యోగిని చితకబాదారు. పోటీ పరీక్షల అభ్యర్థులు బయటకు రాకుండా నిర్బంధించారు. బయట కనిపిస్తే చాలు పోలీస్ వాహనాల్లో ఎక్కించి అక్కడి నుంచి తరలిస్తున్నారు. నిరుద్యోగులు బయటకు రాకుండా లైబ్రరీ గేట్లు, ప్రధాన ద్వారా మూసివేశారు.
Also Read: Loan Waiver Guidelines: రైతులకు రేవంత్ సర్కార్ భారీ షాక్.. రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ
కొన్ని వారాలుగా పోటీ పరీక్షలు వాయిదా వేయాలని డీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లు ఉస్మానియా విశ్వవిద్యాలయంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఉద్యమం మొన్న అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్‌కు పాకింది. అయితే ఎక్కడ ఉద్యమం కనిపించినా రాష్ట్ర ప్రభుత్వం కర్కశంగా అణచివేస్తోంది. తాజాగా అశోక్‌నగర్, చిక్కడపల్లి ప్రాంతంలో నిరుద్యోగులు సోమవారం రాత్రి మళ్లీ ఉద్యమం చేశారు. పరీక్షలు వాయిదా వేయాలంటూ గ్రంథాలయం, స్టడీ హాళ్ల నుంచి బయటకు వచ్చారు. ప్లకార్డులు పట్టుకుని పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అశోక్‌నగర్ వైపు ప్రదర్శనగా వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు నిరుద్యోగులను అడ్డుకున్నారు.
Also Read: Bonalu 2024: బోనాల చెక్కుల పంచాయితీ.. నేలపై కూర్చోని మాజీ మంత్రి సబితా ఆగ్రహం
పెద్ద ఎత్తున నిరుద్యోగులు నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ.. పరీక్షలు వాయిదాలు వేయాలంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అయితే నిరుద్యోగులను అడ్డుకున్న పోలీసులు వారిని తరిమికొట్టారు. ఈ సందర్భంగా అభ్యర్థులపై లాఠీచార్జ్ చేశారు. లాఠీచార్జ్‌తో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విద్యార్థులను లైబ్రరీలోకి తరిమికొట్టారు. అనంతరం లైబ్రరీ ప్రధాన గేటు.. ప్రధాన ద్వారాన్ని మూసివేయించారు. నిరుద్యోగులను లోపలకు నెట్టేసి తాళం వేశారు. దీంతో అభ్యర్థులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, అభ్యర్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం ఏర్పడింది. ఫ్రెండ్లీ పోలీస్ అనే చెప్పుకుంటున్న పోలీస్ విభాగం విద్యార్థులపై లాఠీలతో విరుచుకుపడడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
పగటి పూట చదువు.. రాత్రి ఉద్యమం
తమ భవిష్యత్‌కు కీలకమైన పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులు ప్రత్యేకత చాటుతున్నారు. తమ ప్రిపరేషన్‌కు సమయం లభించడం లేదనే ఉద్దేశంతోనే పరీక్షల వాయిదాకు డిమాండ్ చేస్తున్న నిరుద్యోగులు.. అలాంటిది ఉద్యమం పేరుతో సమయాన్ని వృథా చేయడం లేదు. పరీక్షలు వాయిదా వేయాలని ఉద్యమం చేస్తూ తమ సన్నద్ధతకు ఎలాంటి సమస్య లేకుండా చేసుకుంటున్నారు. రాత్రి వేళ మాత్రమే ఉద్యమం చేయడానికి సమయం కేటాయిస్తున్నారు. పగటి పూట దాదాపు సాయంత్రం 7 గంటల వరకు చదువుకుంటున్న నిరుద్యోగులు.. అనంతరం పరీక్షల వాయిదా కోసం రోడ్డుపైకి వస్తున్నారు. ఇలా చదువుకు.. ఉద్యమానికి పక్కా ప్రణాళికతో సమయం కేటాయించుకోవడం విశేషం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి