Kalki 2898 AD New Record: రెబల్ స్టార్ వరుస సినిమాలతో అలరిస్తున్నాడు. గత యేడాది గ్యాప్ లోనే మూడు సినిమాలతో పలకరించాడు. లాస్ట్ ఇయర్ ‘సలార్’ మూవీతో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చిన ప్రభాస్.. తాజాగా ‘కల్కి’ మూవీతో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసాడు. ముఖ్యంగా నాగ్ అశ్విన్ ఈ సినిమాలో కాశీ, కాంప్లెక్స్, శంబలా అంటూ మూడు ప్రపంచాల్లోకి తీసుకెళ్లాడు. అంతేకాదు ప్రేక్షకులు కూడా రాబోయే భవిష్యత్తులో ప్రపంచం ఎలా ఉండబోతుందో చూపించాడు. ప్రపంచంలో మొదటి నగరమైన కాశీయే .. మన ప్రపంచంలో చివరి నగరమైతే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ ను ‘కల్కి 2898 AD’ చిత్రాన్ని చూపించాడు. ఇక కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రాబోయే ఫ్యూచర్ ను చూపించిన దర్శకుడు.. సెకండ్ పార్ట్ లో 3102 BC మహా భారత యుద్ద కాలాన్ని చూపించబోతున్నాడు.
కల్కి రెండవ పార్ట్ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఇక రెండో భాగాన్ని వచ్చే యేడాది మే 9న విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. మొత్తంగా 6 వేల ప్రయాణాన్ని రెండో పార్ట్ లో చూపించబోతున్నాడు. తాజాగా ఈ సినిమా బాక్సాఫీస్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోన్న ఈ మూవీ.. బుక్ మై షోలో 11 రోజుల్లో 10.29 మిలియన్ టికెట్స్ తెగాయి. అంటే కోటి మంది పైగా బుక్ మై షో లో ఈ సినిమా టికెట్స్ తెగినట్టు అఫీషియల్ గా ప్రకటించారు. ఇది కూడా ఒక రికార్డు.
‘కల్కి’ మూవీ హిందీ, ఓవర్సీస్ సహా అన్ని ఏరియాల్లో దుమ్ము దులుపుతోంది. ఇప్పటికే హిందీ బెల్ట్ లో ఈ సినిమా రూ. 212 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. మొత్తంగా రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మొత్తంగా రూ. 923 కోట్ల గ్రాస్ వసూల్లతో వెయ్యి కోట్ల వైపు పరుగులు తీస్తోంది. అంతేకాదు సైన్స్ ఫిక్షన్ కథతో రూ. 500 పైగా షేర్ తో బాక్సాఫీస్ దగ్గర దూకుడు మీదుంది. ఇక 11 రోజుల్లో అమెరికన్ బాక్సాఫీస్ దగ్గర $17 మిలియన్స్ డాలర్స్ కలెక్ట్ చేసినట్టు సమాచారం. మొత్తంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు కలెక్షన్స్ కొల్లగొడుతుందో వెయిట్ అండ్ సీ.
ఇదీ చదవండి: మన దేశంలో వారాహీ అమ్మవారు దేవాలయాలు ఎక్కడున్నాయి.. వాటి ప్రత్యేకతలు ఏమిటంటే.. !
Read more: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.