ప్రపంచంలోనే టాప్ ర్యాంక్ కలిగిన సాంకేతిక దిగ్గజమైన గూగుల్‌కు యూరొపియన్ యూనియన్‌కి చెందిన కాంపిటిషన్ కమిషన్ భారీ జరిమానా విధించింది. ఆన్లైన్ సెర్చ్ ఇంజన్లో అగ్రగామి అయిన గూగుల్ నిబంధనలకు విరుద్ధంగా ఓ సంస్థకు ప్రకటనల రూపంలో మేలు చేసినందుకుగాను యురొపియన్ యూనియన్‌లోని కాంపిటిషన్ కమిషన్ 1.49 బిలియన్ యూరోల జరిమానా విధిస్తూ కాంపిటిషన్ కమిషనర్ మార్గరెట్ వెస్టగర్ ఆదేశాలు జారీచేశారు.