Body Pains: తరచూ ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నారా.. ఈ ఆకులే దివ్య ఔషధం..!

Body Pains..ఒళ్ళు నొప్పులతో ఇబ్బంది పడేవారు.. ఆముదం ఆకులను తీసుకొని.. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నూనెలో వేయించాలి. ఆపై వాటిని గుడ్డలో కట్టి నూనెతోపాటు.. వేయించిన ఆకుల గుడ్డని నొప్పి ఉన్నచోట పెట్టాలి..దీనివల్ల నొప్పి నివారిణిగా ఇది పనిచేస్తుంది.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jul 4, 2024, 08:15 AM IST
Body Pains: తరచూ ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నారా.. ఈ ఆకులే దివ్య ఔషధం..!

Body Pains.. ఈ మధ్యకాలంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం ఒక ఎత్తైతే..  బిజీ లైఫ్ స్టైల్ లో సమయానికి ఆహారం తీసుకోకపోవడం మరొక ఎత్తు. దీని ఫలితంగా వయసు తో సంబంధం లేకుండా పిల్లల నుంచి పెద్దల వరకు తీవ్రమైన ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నారు. కాస్త నడుము వంచి కొంచెం పని చేస్తే చాలు.. అప్పుడే నడుము నొప్పి, కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు అంటూ ఇబ్బందిపడిపోతున్నారు. ఒకప్పుడు 60 సంవత్సరాలు పైబడినా కూడా ఇంకా పెద్దవారు చాలా ఆరోగ్యంగా అన్ని రకాల పనులు చేసుకుంటూ కనిపించేవారు..కానీ ఈ మధ్యకాలంలో 10 సంవత్సరాల పిల్లవాడు కూడా కొద్దిగ పని చేస్తేనే అలసిపోతున్నారు. ఇక ఇలాంటి ఒళ్ళు నొప్పులను దూరం చేసుకోవాలి.. అంటే కొన్ని రకాల చిట్కాలను పాటించాలని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు.

ఒళ్ళు నొప్పులకు చక్కటి పరిష్కారం..

ఒళ్ళు నొప్పులను దూరం చేయాలి అంటే.. ఆముదం ఆకులు చాలా చక్కగా పనిచేస్తాయట. ఆముదం ఆకులు పలు రకాల వ్యాధులను నయం చేస్తాయట.. కాళ్ల నొప్పులు,  మోకాళ్ల నొప్పులు,  మెడ నొప్పి, చేతినొప్పి, నడుము నొప్పి , భుజం నొప్పి ఇలా శరీరంలో ఏ భాగంలో నొప్పి వచ్చినా సరే ఈ ఆకులను.. ఉపయోగించి దూరం చేసుకోవచ్చు. 

ఎలా ఉపయోగించాలి..

ఒళ్ళు నొప్పులతో ఇబ్బంది పడేవారు.. ఆముదం ఆకులను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నూనెలో వేయించాలి. ఆపై వాటిని గుడ్డలో కట్టి నూనెతోపాటు.. వేయించిన ఆకుల గుడ్డని నొప్పి ఉన్నచోట పెట్టాలి. దీనివల్ల నొప్పి నివారిణిగా ఇది పనిచేస్తుంది.

ఈ రోగాలన్నీ పరార్..

ఒక ఒళ్ళు నొప్పులే కాదు అజీర్తి , పైల్స్ తో పాటూ చిన్నపిల్లల నుండి పెద్దల వరకు కడుపులో నులి పురుగులను కూడా తగ్గించేందుకు ఈ ఆముదం ఆకులను ఉపయోగిస్తారు.. ఆముదం నూనె అజీర్తికి బాగా పనిచేస్తుంది. కడుపు సమస్యలను కూడా దూరం చేయగలదు. బేధి మందు లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. జీర్ణక్రియ పనితీరును ప్రోత్సహిస్తుంది. శరీరంలో తెల్ల రక్త కణాలను పెంచడంలో సహాయపడుతుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.. బ్యాక్టీరియా క్యాన్సర్ కణాలను కూడా చంపేస్తుంది. 

నిత్య యవ్వనంగా..

చర్మానికి మంచి మాయిశ్చరైజర్ కూడా... శరీరాన్ని హైడ్రేట్ చేసి తేమను అందిస్తుంది.. బయటి పొర ద్వారా జరిగే నీటి నష్టాన్ని నివారించి.. చర్మాన్ని మృదువుగా ముడతలు లేకుండా చక్కటి చర్మాన్ని మీకు అందిస్తుంది. కొబ్బరినూనె లేదా ఆలివ్ నూనెతో కూడా ఆముదం నూనెను కలిపి ముఖానికి రాసుకోవచ్చు.

Also Read: Pawan Kalyan: సినిమాలపై పవన్‌ కల్యాణ్‌ సంచలన ప్రకటన.. ఓజీ సినిమాపై ఏం చెప్పారంటే?

Also Read: Mokshagna: బిగ్‌ బ్రేకింగ్‌.. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్‌.. డైరెక్టర్‌ ఎవరో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News