Kajal Aggarwal: బుద్దిచ్చింది.. ఇకపై వాటి జోలికి పోనంటున్న కాజల్ అగర్వాల్..

Kajal Aggarwal: బుద్దిచ్చింది.. ఇకపై వాటి జోలికి పోనంటున్న కాజల్ అగర్వాల్. రీసెంట్ గా కాజల్ .. సత్యభామ అంటూ క్రైమ్ యాక్షన్ డ్రామా మూవీతో పలకరించింది. ఈ సినిమా ఓ మోస్తరుగా బాగున్నా.. బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితం అందుకోలేదు. దీంతో ఇకపై ఇలాంటి లేడీ ఓరియంటెడ్ మూవీస్ జోలికి పోనంటోంది టాలీవుడ్ చందమామ.

1 /6

మ్యారేజ్  త‌ర్వాత సర్వ సాధారణంగా ఎక్కువ  కెరీర్‌కు ఎండ్ కార్డ్ ప‌డిన‌ట్టే. కానీ  కాజల్ అగర్వాల్ వంటి కొంత మంది హీరోయిన్స్ మాత్రం పెళ్లైన ఇప్ప‌టికీ వరుస చిత్రాలతో  బాక్సాఫీస్‌ను ర‌ఫ్ఫాడిస్తోంది.

2 /6

హీరోయిన్ గా  ఎంట్రీ ఇచ్చి దాదాపు రెండు దశాబ్దాలైన ఇప్పటికీ అదే సోయగంతో అలరిస్తోంది కాజల్ అగర్వాల్. పెళ్లై ఓ పిల్లాడు పుట్టే వరకు సినిమాలకు దూరంగా ఉన్న .. కాజ‌ల్.. తాజాగా ‘స‌త్య‌భామ’ మూవీ‌తో ఆడియన్స్ ను పలకరించింది.

3 /6

సత్యభామ ఫ్లాప్ తో ఇకపై లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేయోద్దని డిసైడ్ అయింది. ఒకవేళ చేసినా.. ఓటీటీ లో రిలీజయ్యే సినిమాలు మాత్రమే చేస్తానంటోంది. తాజాగా విడుదలైన సత్యభామ సినిమాకు కనీస ఓపెనింగ్స్ రాకపోవడంతో కాజల్ డిసప్పాయింట్ అయినట్టు తెలుస్తోంది.

4 /6

అందుకే ఇకపై మహిళా ఇతివృత్తాలతో తెరకెక్కే చిత్రాల్లో నటించనని తెగేసి చెబుతోంది కాజల్ అగర్వాల్. 

5 /6

కాజ‌ల్ అగ‌ర్వాల్ గతేడాది ‘భ‌గ‌వంత్ కేస‌రి సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. అయినా.. ఈ సినిమా క్రెడిట్ మాత్రం బాల‌య్య ఖాతాలోకే వెళ్లింది.

6 /6

కాజల్ అగర్వాల్..  తేజ దర్శకత్వంలో క‌ళ్యాణ్ రామ్ హీరోగా తెర‌కెక్కిన  'లక్ష్మి కళ్యాణం' మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.  ఆ త‌ర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.