Vastu Dosha: ఇంట్లో ఈ ఒక్క వస్తువు ఉంటే ఇంటికి వాస్తు దోషమే ఉండదు..

Vastu Dosha Remedy: వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణంతో పాటు ఇంట్లో వస్తువులు కూడా చాలా ముఖ్యం. ఏ దిశలో వాస్తు పరంగా ఏ వస్తువులు ఉండాలో అలా ఉండకపోతే ఇంటికి నెగిటివిటీ చుట్టుకుంటుంది.

Written by - Renuka Godugu | Last Updated : Jun 12, 2024, 04:01 PM IST
Vastu Dosha: ఇంట్లో ఈ ఒక్క వస్తువు ఉంటే ఇంటికి వాస్తు దోషమే ఉండదు..

Vastu Dosha Remedy: వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణంతో పాటు ఇంట్లో వస్తువులు కూడా చాలా ముఖ్యం. ఏ దిశలో వాస్తు పరంగా ఏ వస్తువులు ఉండాలో అలా ఉండకపోతే ఇంటికి నెగిటివిటీ చుట్టుకుంటుంది. అయితే వాస్తు ప్రకారం ఇంట్లో ఉండే వస్తువులు కూడా ఇంట్లో ఉండే నెగటివిటీని తీసివేస్తాయి. వాస్తు ప్రకారం మనం ఇంట్లో ఏ వస్తువులను ఉంచుకోవాలో దాని వల్ల ఏ లాభాలో తెలుసుకుందాం.

నిజానికి మన వంటింట్లో ప్రధానమైన వస్తువు ఉప్పు. దీన్ని లక్ష్మీదేవికి ప్రతికగా సూచిస్తారు. ఉప్పు లేకపోతే ఆ కూర రుచించదు. జ్యోతిష్యం ప్రకారం ఉప్పు ఇంట్లోని నెగిటివిటీని తొలగిస్తుంది. వాస్తు దోషాలకు చెక్‌ పెడుతుంది. ఉప్పు ఇంట్లో ఎలాంటి ప్రయోజనాలు కలిగిస్తుందో తెలుసుకుందాం.

కుటుంబంలో సఖ్యత..
ఇంట్లో కుటుంబంలో సఖ్యత నిలపడానికి కూడా ఉప్పును వినియోగిస్తారు. ఒకవేళ మీ ఇంట్లో మీ బంధుమిత్రులతో ఎలాంటి గొడవలు అయినా ఉంటే ఇంటి ప్రధాన ద్వారం కుడి లేదా ఎడమ సైడు ఒక బాల్ లో ఉప్పును పెట్టండి. దీంతో కుటుంబంలో సఖ్యత నెలకొంటుంది

దృష్టి దోషం..
అంతేకాదు జ్యోతిష ప్రకారం పై ఉండే దృష్టి దోషాన్ని కూడా ఉప్పు తొలగిస్తుంది. అమ్మమ్మల కాలం నాడు దృష్టి దోషం తగిలితే మన పైనుంచి ఉప్పు తీసేసినట్టు చూసే ఉంటాం. గుప్పెడు ఉప్పుతో మన చుట్టూ ఉప్పుతో తిప్పితే మనకు ఉండ నెగటివిటీ తొలగిపోతుంది. దృష్టి దోషం తగ్గిపోతుందని అమ్మమ్మల కాలం నుంచి ఈ చర్యను అనుసరిస్తారు.

ఇదీ చదవండి: ఈ 6 ప్రత్యేక శుభ యాదృచ్ఛికాల మధ్య రేపే నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం..

వాస్తు దోషం..
అంతేకాదు వాస్తు ప్రకారం మీ ఇంట్లో వాస్తు దోషం నెలకొని ఉంటే కూడా ఉప్పు మంచి రెమెడీగా పనిచేస్తుంది. ఉత్తరం ఈశాన్య దిశలో వాష్రూమ్స్ ఉన్నప్పుడు అందులో ఒక బౌల్లో ఉప్పు పెడితే అది ఇంట్లో వాస్తు బ్యాలెన్స్ చేస్తుంది. వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయి

ఇదీ చదవండి: తిరుమల శ్రీవారి ఉచిత దర్శనం కేవలం 30 నిమిషాల్లోనే.. వేంకటేశ్వరస్వామిని సులభంగా చూసే సూపర్ ఛాన్స్!

ఆరోగ్యం..
అంతేకాదు ఉప్పుతో ఆరోగ్యం మీరు స్నానం చేసే నీటిలో ఉప్పు వేసుకొని స్నానం చేస్తే ఒంటినొప్పులు కూడా తగ్గిపోతాయి. ఎవరైనా డిప్రెషన్ సమస్యలతో బాధపడితే వారికి దగ్గరలుగా ఒక గాజు గ్లాసులో ఉప్పు వేసి పెట్టండి. నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది.

చెడు ఆలోచనలు..
ఒకవేళ మీరు విపరీతంగా చెడు ఆలోచనలతో బాధపడుతున్నట్లయితే నీటిలోపు వేసుకొని స్నానం చేయండి ఇలా చేయడం వల్ల త్వరగా మీరు నయమవుతుంది.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News