రివ్యూ : టామ్ అండ్ జెర్రీ (Tom And Jerry )
నటీనటులు - అమలన్ దాస్, హర్మన్ దీప్ కౌర్, చంద్ర మహేశ్, తోట వేణు గోపాల్, రవితేజ నిమ్మల, శ్రీకృష్ణ గొర్లె, బాలు చరణ్, సింగం మహేశ్ తదితరులు
ఎడిటర్ : ఎస్ బీ ఉద్ధవ్
సినిమాటోగ్రాఫర్: అజిత్ బాషా
మ్యూజిక్: ఎంఎల్పీ రాజా
రైటర్ - శివ నిర్మల
నిర్మాత - పాలేపు వెంకటేశ్వరరావు
డైరెక్టర్ - జే శ్రీ శివన్
Tom and Jerry Movie Review: ఈ మధ్యకాలంలో తెలుగులో యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టేనర్ లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు మూవీ మేకర్స్. ఈ నేపథ్యంలో తెరకెక్కిన మరో చిత్రం ‘టామ్ అండ్ జెర్రీ’. అమలన్ దాస్, హర్మన్ దీప్ కౌర్ జంటగా నటించారు. జే. శ్రీ శివన్ డైరెక్ట్ చేశారు. ఈ వారం విడుదలైన "టామ్ అండ్ జెర్రీ" ఎలా ఉందో రివ్యూలో చూద్దాం
కథ విషయానికొస్తే..
లక్కీ (అమలన్ దాస్) పెద్దగా బాధ్యతలు ఎలాంటి లక్షం లేని పైలా పచ్చీస్ గా తిరిగే సాధారణ కుర్రాడు. లక్కీ తన ఫ్లాట్ ను భానుమతి (హర్మన్ దీప్ కౌర్) తో షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. భానుమతి ఐటీ ఉద్యోగం చేస్తూ ఉంటుంది. ఒక డబ్బున్న అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని జీవితంలో సెటిల్ కావాలనేది లక్కీ ఆలోచన. మంచి ఉద్యోగం చేస్తూ ఆమెరికాలో సెటిల్ కావాలనేది భానుమతి కల. అయితే ఒకరోజు రాత్రి లక్కీ, భానుమతి కలిసి స్పెండ్ చేసే సందర్భం వస్తుంది. ఆ రాత్రి తర్వాత ఈ జంట జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి ?. వారి మధ్య ఎలాంటి బంధం ఏర్పడింది ?. టామ్ అండ్ జెర్రీలా లక్కీ, భానుమతి ఎలా మారిపోయారు ? అనేదే ఈ సినిమా స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
టైటిల్ కు తగ్గట్టే హీరో, హీరోయిన్లు లక్కీ, భానుమతి క్యారెక్టర్లు టామ్ అండ్ జెర్రీలా ఉంటూ ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్విస్తాయి. వారి ఈగోల వల్ల ఎలాంటి క్లాష్ ఎదురైంది. లక్కీ, భానుమతి పాత్రల నేపథ్యం కూడా భిన్నంగా ఉండటం ఈ సినిమాకు కలిసొచ్చేలా ఉంది. చిన్నప్పటి నుంచి తను పెరిగిన వాతావరణం వల్ల లక్కీ బద్దకస్తుడిగా.. బాధ్యతలు లేనివాడిగా వ్యవహరిస్తుంటాడు. కానీ భానుమతి జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని జీవితంలో బాగా సెటిల్ అవ్వాలని కోరుకునే అమ్మాయి. పెళ్లికి ముందు ఈ జంట మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం వారిలో కొత్త బంధాన్ని ఏర్పరుస్తుంది. ఒకరి అభిప్రాయాలను మరొకరు, ఒకరి స్వేచ్ఛను అర్థం చేసుకునేలా చేస్తుంది.
సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ తో ఈ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసాడు దర్శకుడు. ఇది సెకండాఫ్ పై మరింత ఆసక్తిని రేకిత్తిస్తోంది. ఒక అగ్రిమెంట్ తో హీరో హీరోయిన్ల మ్యారేజ్ తర్వాత ఏం జరుగుతుంది అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా చేసాడు. సంప్రదాయ ఆలోచనలు గల హీరో, నేటి తరం ఆలోచనలు గల ఆధునిక భావాలున్న యువతి పాత్రలో హీరోయిన్ తన జీవితాన్ని తన స్క్రిప్ట్ లో మంచిగానే పొందుపరిచాడు. ఎడిటర్ తన కత్తెరకు పదును పెడితే బాగుండేది. ఉన్నంత నిర్మాణ విలువలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై ఇంకాస్త ఇంట్రెస్ట్ పెడితే బాగుండేది.
నటీనటుల విషయానికొస్తే..
టామ్ అండ్ జెర్రీలో కొత్త నటీనటులు నటించారు. దీంతో సినిమాకు ఒక కొత్తదనం వచ్చింది. లీడ్ పెయిర్ అమలన్ దాస్, హర్మన్ దీప్ కౌర్ మధ్య మంచి కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యింది. భానుమతి క్యారెక్టర్ లో హర్మన్ దీప్ కౌర్ తన నటనతో ఆకట్టుకున్నారు. దర్శకుడు చంద్ర మహేశ్ హీరో అమలన్ దాస్ కు తండ్రి పాత్రలో కనిపించారు. ఆయన అడ్వకేట్ గా తన పాత్రలో ఒదిగిపోయారు. ఇరత పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.
ప్లస్ పాయింట్స్
కథనం
నిర్మాణ విలువుల
మైనస్ పాయింట్స్
రొటీన్ సన్నివేశాలు
లాజిన్ లేని సీన్స్
ఎడిటింగ్
రేటింగ్: 2.5/5
ఇదీ చదవండి:ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం.. రామోజీరావుపై మెగాస్టార్ ట్వీట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter