Pm modi offer to Janasena pawan kalyan: ఇటీవల దేశంలో జరిగిన ఎన్నికలు చరిత్రలో లిఖించదగ్గవిగా మారాయి. ప్రజలు ఎగ్జీట్ పోల్స్ అంచనాలకు పూర్తిగా భిన్నంగా ఎన్నికల ఫలితాలు ఇచ్చారు. మరోవైపు.. కేంద్రంలో అప్ కీ బార్ చార్ సో పార్ అన్న మోదీకీ ఊహించని షాక్ ఇచ్చి మిత్రపక్షపార్టీలపై ఆధారపడేలా చేసింది. మరోవైపు ఏపీలో వైఎస్ జగన్ కు, తెలంగాణలో బీఆర్ఎస్ కు కూడా ప్రజలు అదే విధంగా ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. దీంతో ప్రస్తుతం కేంద్రంలో బీజేపీకి సరైన మెజారీటి రానందున కేంద్రంలో అధికారంలో ప్రభుత్వంఏర్పాటు చేయాలంటూ... మోదీ, ఇటు చంద్రబాదు, అటు నితీష్ కుమార్ లపై ఆధారపడాల్సి వచ్చింది.
Read more: Snakes venom: ఈ మొక్కలతో పాము విషం బలాదూర్.. ఇలా పెంచుకోవాలంటున్న నిపుణులు..
ఈ నేపథ్యంలో గతంలో చంద్రబాబు హస్తినకు వెళ్తే కనీసం అపాయింట్ ఇవ్వని మోదీ, అమిత్ షాలు ఇప్పుడు ఏకంగా మోదీ పక్కనే చంద్రబాబును కూర్చుండబెట్టారు. దీంతో ఒక తెలుగోడి చరిష్మా ఏంటో ప్రపంచానికి తెలిసింది. ఇక మరోవైపు ఏపీకి స్పెషల్ స్టేటస్, రాజధాని, పోలవరం, విశాఖ ఉక్కు కర్మాగారం వంటి సమస్యలను పరిష్కరించుకొవడానికి ఇదే సరైన సమయమని ఏపీలోని మేధావులు భావిస్తున్నారు. ఈ సమయంలో ఏపీ నేతలు ఢిల్లీ నేతల మెడలువంచి రాష్టాం డెవలప్ మెంట్ కోసం నిధులు సమకూర్చుకొవాలంటూ కూడా కోరుతున్నారు. అదే విధంగా మోదీ క్యాబినేట్ లోని కీలక శాఖల్లో కొన్ని తీసుకుంటే కూడా ఏపీకి మంచి జరగొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మోదీ క్యాబినేట్ లో ఇప్పటికే నాలుగు మినిస్ట్రీలు టీడీపీ, జనసేనకు కన్ఫామ్ అయినట్లు కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జనసేన పవన్ కళ్యాణ్ కు కేంద్ర రాజకీయాల్లో క్యాబినెట్లో కీలక పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కు రైల్వే, వ్యవసాయం వంటి శాఖలను ఇవ్వొచ్చని వార్తలు విన్పిస్తున్నాయి. మరోవైపు ఏపీ ప్రజలు మాత్రం తమ జనసేన నాయకుడు ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు క్యాబినేట్ లో డిప్యూటీ సీఎం లేదా హోంమినిస్ట్రీ ఇవ్వాలని కూడా కొందరు కోరుతున్నారు.
Read more: Ramoji rao: రామోజీరావు వల్లే అమరావతి రాజధాని.. ఆ సీక్రెట్ బయట పెట్టిన చంద్రబాబు..
ఇక దేశంలో రేపు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హజరు కావాలంటూ.. ఇప్పటికే మన దేశంతో పాటు, ప్రపంచదేశాధినేతలకు ఇన్విటేషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మోదీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు, ఆయనతో పాటు ఎవరికి చాన్స్ ఇస్తారో అనేది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ గానే మారింది. మరోవైపు.. మోదీ ఏ పోర్ట్ ఫోలియో ఇచ్చిన కూడా ఆయనకు తమ సపోర్టు ఉంటుందని కూడా మిత్రపక్షపార్టీలు మోదీకే తన ఫుల్ సపోర్ట్ అంటూ వ్యాఖ్యలు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter