సినిమా : ఓసీ (OC)
నటీనటులు: హరీష్ బొంపెల్లి, మాన్య సలాడి, రాయల్ శ్రీ, లక్ష్మీ కిరణ్ తదితరులు.
సంగీత దర్శకుడు: భోలే శివాలి
సినిమాటోగ్రఫీ: సాయిరాం తుమ్మలపల్లి
నిర్మాత: బీవీఎస్
బ్యానర్: కౌండిన్య ప్రొడక్షన్స్
కొరియోగ్రాఫర్: సత్య మాస్టర్
దర్శకత్వం: విష్ణు బొంపెల్లి
విడుదల: 7/6/2024
కౌండిన్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బీవీస్ నిర్మాతగా, విష్ణు బొంపెల్లి డైరెక్షన్స్ లో తెరకెక్కిన చిత్రం ఓసీ. కేవలం డబ్బులు ఉన్నంత మాత్రానా హీరోలు కాలేరు. ట్యాలెంట్ ఉంటే ఎవరైనా స్టార్లు కావచ్చు అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రం ‘ఓసీ’. ఇప్పటికే ట్రైలర్‌లో, ప్రచార చిత్రాలతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.
కథ:
ఓ బస్తీలో అనాథలైన రాక్ (హరీష్ బొంపెల్లి), మాగ్నైట్ (రాయల్ శ్రీ), కమల్ హాసన్ (లక్ష్మీ కిరణ్) ముగ్గురు మంచి ఫ్రెండ్స్. ఒకరింటే మరొకరికి ప్రాణం. వీరికి నర్సింగ్ అనే వ్యక్తి అండగా ఉంటాడు.ఈ క్రమంలో వీళ్లకు సందీప్ అనే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పరిచయం అవుతాడు. మందు ఇప్పిస్తే అవకాశం ఇప్పిస్తా అంటాడు. ఈ క్రమంలో వీరికో రౌడీ ఎదురువుతాడు. అతని కొన్ని ప్రాబ్లెమ్స్ ఫేస్ చేస్తారు. ఈ క్రమంలో సినిమా ప్రయత్నాలు చేస్తోన్న వీరికి సినిమాలో ఛాన్స్ దక్కాయా లేదా ఈ క్రమంలో వీరి ప్రేమ ఓ పక్క సాగుతూ ఉంటుంది. సినిమాలే జీవితంగా బతుకున్న వీళ్లకు సినిమా అవకాశాలు దక్కాయా.. ? లేదా ఓసీ మూవీ స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే:
తెలుగులో సినిమా రంగం నేపథ్యంలో శివరంజని, అద్దాల మేడ వంటి ఎన్నో చిత్రాలొచ్చాయి. ఈ జనరేషన్ లో ఖడ్గం, నేనింతే సినిమాలు కూడా ఇదే తరహా నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ,చిరంజీవిని స్పూర్తిగా తీసుకొని ఈ కథ రాసుకున్న తీరు బాగుంది. ఫస్ట్ ఆఫ్ అంతా చాలా కామెడీతో తమ లక్ష్యం కోసం ప్రయత్నించే కుర్రాళ్లు ఈ క్రమంలో వాళ్ల ప్రేమ అనేది మరో యాంగిల్ లో తీసుకున్నారు. అలాగే సినిమా ఆడిషన్స్‌లో జరిగే కామెడీని బాగా చూపించారు. ఇంటర్వెల్ వచ్చే ఫైట్ సీన్ చాలా బాగుంది. ముగ్గురు కలిసి చేసే ఫైట్ సీన్ కమర్షియల్ సినిమాను తలపిస్తుంది.
ఇక సెకండ్ ఆఫ్ సినిమాకు కీలకం అని చెప్పాలి. అందేకాదు రెండో భాగంలో కావాల్సినంత ఎమోషన్ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తోంది. సినిమే ప్రపంచం అని బతికే కుర్రాళ్లు ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది రియలిస్టిక్ గా చూపించారు. తమ లక్ష్యం, మధ్యలో రివేంజ్, స్నేహం ఈ ముడింటిని బ్యాలెన్స్‌డ్‌గా కథ నడిపించిన తీరు ఆడియన్స్ ను కిక్కేస్తోంది. క్లైమాక్స్ ఇంట్రెస్టింగ్ ఉంది. చూసే ప్రేక్షకుడి కళ్లు చెమ్మగిళ్లుతాయి. కాకపోతే అక్కడక్క కాస్త ఎడిటర్ తన కత్తెరకు పనిచెబితే బాగుండేది.
తెలుగులో ఇలాంటి తరహా కథలు బాగానే వచ్చాయి. ఇది వరకు చేసాము. దాన్ని అంతే అత్యద్భుతంగా మలచడంలో డైరెక్టర్ విష్ణు బొంబెల్లి మెప్పించాడు. ఫస్ట్ సినిమా అయినా ఫర్ఫెక్ట్ టేకింగ్ అని చెప్పాలి. ఎమోషన్స్ పండించడంలో డైరెక్టర్ మంచి మార్కులు కొట్టేశాడు. 24 క్రాఫ్ట్స్ ను చాలా చక్కగా ఉపయోగించుకున్నాడు. ఈయనకు ఇండస్ట్రీలో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పాలి. అలాగే సినిమాటోగ్రాఫర్ సాయిరాం తుమ్మలపల్లి కెమెరా యాంగిల్స్, ఫ్రేమ్స్ మెప్పించాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటులు:
హీరోగా నటించిన హరీష్ బొంబెల్లి సిల్వర్ స్క్రీన్ కు న్యూ ఎంట్రీ అయినా.. తన యాక్టింగ్ తో మెప్పించాడు. చాలా మెచ్యూర్‌డ్ గా నటించారు. యాక్షన్ సన్నివేశాల్లో ఇరగదీసాడు. అలాగే కొన్ని సీన్స్ లో అద్భుతంగా చేశాడు. ఆడిషన్స్ ఇచ్చే సీన్స్ తో తన నటనతో కట్టిపడేశాడు. కచ్చితంగా వెండితెరపై మంచి క్యారెక్టర్లు పడితే నిలుచుండిపోయే ఫర్ఫార్మెన్స్ ఇచ్చాడు. హీరో ఫ్రెండ్స్ గా నటించిన రాయల్ శ్రీ, లక్ష్మీ కిరణ్ అద్భుతంగా నటించారు. వీరిద్దరిది ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్లు. తెరపై కనిపించిన ప్రతీసారి మెప్పించారు. అలాగే హీరోయిన్ మాన్య సలాడిది కూడా మంచి పాత్ర దొరికింది. ఉన్నంతలో చాలా బాగా చేసింది. అలాగే బాబు రావు పాత్ర చేసిన జీవన్ నవరసాలు పండించాడు. మిగతా నటీనటులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.
ప్లస్ పాయింట్స్
కథనం
నటీనటులు
మ్యూజిక్
మైనస్ పాయింట్స్
ఫస్ట్ హాఫ్
ఎడిటింగ్
లాజిన్ లేని సీన్స్
రేటింగ్: 2.75/5
Also Read: KT Rama Rao: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నిరాశే.. కానీ ఫినీక్స్ పక్షిలాగా తిరిగి పుంజుకుంటాం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter