Naga Chaitanya-Sobhita: నాగచైతన్య, శోభిత రిలేషన్ పై క్లారిటీ.. వైన్ టెస్ట్ చేస్తూ యూరప్ లో కనిపించిన జంట

Naga Chaitanya: నాగచైతన్య,‌ శోభిత ప్రేమలో ఉన్నారని ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న వార్తలకి…ఇప్పుడు ఫైనల్ గా క్లారిటీ దొరికేసింది. ఇద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 1, 2024, 07:58 AM IST
Naga Chaitanya-Sobhita: నాగచైతన్య, శోభిత రిలేషన్ పై క్లారిటీ.. వైన్ టెస్ట్ చేస్తూ యూరప్ లో కనిపించిన జంట

Naga Chaitanya-Sobhita Pic: సమంత విడాకులు జరిగిన దగ్గర నుంచే.. నాగచైతన్య, శోభిత ప్రేమలో ఉన్నారు అనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ వచ్చింది. కానీ దీనిపైన ఇద్దరు కూడా క్లారిటీ ఇవ్వలేదు. అయితే అప్పట్లో ఒక ఫోటో వైరల్ కాగా.. అందులో ముందర నాగచైతన్య వెనక శోభిత కనిపించారు. ఇక ఈ మధ్య కూడా ఇంస్టాగ్రామ్ లో ఇద్దరూ.. వేరువేరు ఫోటోలు షేర్ చేసిన.. వారి ఫోటోలలో వెనక బ్యాక్ గ్రౌండ్ ఒకటే ఉండడంతో.. ఇద్దరూ కలిసి వెకేషన్ వెళ్లారు అని రూమర్స్ రాసాగాయి. అయితే ఇది రూమర్స్ కాదు..నిజమేనని.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటోతో క్లారిటీ వచ్చేసింది.

తాజాగా, శోభితతో నాగచైతన్య యూరప్ ట్రిప్‌కు వెళ్లారు. అక్కడ ఓ వైన్ టెస్ట్ పార్టీ జరుగుతుండగా.. పార్టీకి వీరిద్దరూ కలిసి వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్‌గా మారాయి. ఇందులో వీరిద్దరూ పక్కపక్కనే నిలబడుకొని ఉన్నారు. దీంతో అది చూసిన వారు కొందరు సమంత విడాకులు తీసుకోగానే..చై మూవ్ ఆన్ అయ్యాడు అని కామెంట్లు పెడుతున్నారు. కానీ చాలామంది మాత్రం.. అసలు సమంత ఎందుకు విరాకులు ఇచ్చిందో ఫైనల్ గా క్లారిటీ వచ్చింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. అప్పట్లో సమంత ఫ్రెండ్..’నువ్వు అనుకున్నది సాధించావు బిచ్’ అని సమంత విడాకులు ప్రకటించగానే ఒక పోస్ట్ వేశారు. అయితే నాగచైతన్య ఎవరితోనో రిలేషన్ లో ఉన్నారని.. అందుకే ఆ అమ్మాయిని తిడుతూ.. సమంత ఫ్రెండ్ పోస్ట్ వేశారని అప్పట్లో తెగ వార్తలు వచ్చాయి. ఇక  ఆ అమ్మాయి ఎవరో కాదు శోభితనే అంటూ.. విడాకుల విషయంలో సమంత తప్పు ఏమీ లేదు అంటూ.. సమంత అభిమానులు ఇప్పుడు ఈ ఫోటో షేర్ చేసి మరి కామెంట్స్ పెడుతున్నారు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by BollywoodShaadis.com (@bollywoodshaadis)

అయితే శోభిత డేటింగ్ వార్తలపై ఈ మధ్యనే స్పందించినట్లు తెలుస్తోంది. ‘‘వ్యక్తులు సగం జ్ఞానంతో రాసే విషయాలకు సమాధానమివ్వడం కంటే.. వాటిని వదిలేయడం మంచిది. ఒకరి జీవితంపై దృష్టి పెట్టే విధానంను మెరుగుపరుచుకోండి. ప్రశాంతంగా ఉండండి. మంచి వ్యక్తిగా ఉండటానికి ట్రై చేయండి’’ అని చెప్పుకొచ్చిందట. మరి ఇప్పుడు ఈ ఫోటో గురించి వీరిద్దరూ ఏమి చెబుతారో వేచి చూడాలి.

Also read: Millionaire Formula: కోటీశ్వరులు కావాలంటే ఈ SIP ఫార్ములా ఫాలో కావల్సిందే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News