Dirty Fellow Movie Review: 'డర్టీ ఫెలో' మూవీ రివ్యూ..

Dirty Fellow Movie Review: ఈ మధ్యకాలంలో డిఫరెంట్ కంటెంట్ మూవీస్‌ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ కోవలో వచ్చిన మరో చిత్రం 'డర్టీ ఫెలో'. భారతీ నేవీలో పనిచేసిన ఎక్స్ సర్వీస్‌ మెన్ శాంతి చంద్ర హీరోగా నటించిన ఈ సినిమా ఈ రోజు విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : May 24, 2024, 04:21 PM IST
Dirty Fellow Movie Review: 'డర్టీ ఫెలో' మూవీ రివ్యూ..

మూవీ రివ్యూ: డర్టీ ఫెలొ
నటీనటులు: శాంతిచంద్ర, దీపిక సింగ్, సిమ్రిత్, నికిష రంగ్ ,డ సత్యప్రకాష్,నాగి నిడు, ఎఫ్ ఎమ్ బాబాయ్, కుమరన్, జయశ్రీ, సురేంద్ర తదితరులు
ఎడిటర్‌ : జేపీ
సంగీతం: డాక్టర్‌. సతీష్‌ కుమార్‌.పి.
సినిమాటోగ్రఫీ: రామకృష్ణ. యస్‌.
నిర్మాత: జి.యస్. బాబు
నిర్మాణ సంస్థ: రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్
దర్శకత్వం: ఆడారి మూర్తి సాయి
విడుదల తేది: 24-5-2024

భారత నేవీలో పనిచేసిన ఎక్స్ సర్వీస్ మెన్ శాంతి చంద్ర హీరోగా నటించిన సినిమా ‘డర్టీ ఫెలో’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌, ట్రైలర్‌కు ప్రేక్షకాదరణ పొందాయి. మరోవైపు ప్రమోషన్స్‌తో ఈ సినిమా పై అంచనాలు ఏర్పడ్డాయి. ‌మరి ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఆడియన్స్‌ను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయాకొస్తే..

మాఫియా డాన్‌ జేపీ (నాగినీడు), శంకర్ నారాయణ (సత్య ప్రకాష్) ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఇద్దరు కలిసే ఎన్నో సెటిల్‌మెంట్స్‌ చేస్తుంటారు. అయితే జేపీని తప్పిస్తే తనే మాఫీయా డాన్‌గా ఉండొచ్చని శంకర్‌ నారాయణ కుట్ర పన్నుతాడు. ఈ సందర్భంగా జేపీని పోలీసులకు పట్టించే ప్రయత్నం చేస్తాడు శంకర్ నారాయణ. ఈ క్రమంలో పోలీసుల కళ్లు గప్పి తప్పించుకునే క్రమంలో శంకర్‌ నారాయణ కొడుకు చనిపోతాడు. దీంతో శంకర్‌ నారాయణ జేపీపై పగ పెంచుకుంటాడు. ఎప్పటికైనా నీ కొడుకు శత్రు అలియాస్‌ డర్టీ ఫెలో(శాంతి చంద్ర)ని తానే చంపుతానని జేపీకి వార్నింగ్‌ ఇస్తాడు. కట్‌ చేస్తే.. సిద్దు (శాంతి చంద్ర) ఓ గూడెంలోని పూజారి ఇంట్లో ఉంటూ.. అక్కడి పిల్లలకు చదువు చెబుతుంటాడు. పూజారి కూతురు రాగ (దీపికా సింగ్) సిద్దు అంటే వల్లమాలిన అభిమానం. అంతేకాని అతన్ని ప్రేమిస్తూ ఉంటుంది. అదే గ్రామానికి  సేంద్రియ వ్యవసాయ పరిశోధన మీద చిత్ర (సిమ్రితి) వస్తుంది. ఇక ఆ గూడెన్ని, ఆ అటవీ ప్రాంతాన్ని శంకర్ నారాయణ మనిషి పోతురాజు అనధికారికంగా తన గుప్పిట పెట్టుకొని ఏలుతుంటాడు.  అలాంటి పోతురాజుని సిద్దు హత్య చేస్తాడు. అసలు సిద్దను ఆ పోతురాజును ఎందుకు చంపాల్సి వస్తోంది. అటు శంకర్ నారాయణ సిద్దును చంపడానికి చేసిన ప్లాన్స్ ఏమిటి ? చివరకు సిద్దు, డర్లీ ఫెలో ఒకరేనా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

తెలుగులో ఈ తరహా మాఫియా చిత్రాలు ఎన్నో వచ్చాయి. హీరో అజ్ఞాతంలో ఉండటం.. విలన్స్ అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించే క్రమం. ఈ లోపు అతని అజ్ఞాతవాసం ఎందుకు చేయాల్సి వచ్చిందనేది ఎన్నో సినిమాల్లో చూసిన ఎవర్ గ్రీన్ ఫార్మాలా. అదే ఈ సినిమా కోసం అప్లై చేసాడు. అది ఎంత వరకు వర్కౌట్ అవుతుందనే దానిపై సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. ఇక 'డర్టీ ఫెలో' కోసం వీరు రాసుకున్న కథనం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో తెరకెక్కించడం ప్రేక్షకులను ఆకట్టుకునే అంశం.  

సినిమాలో వచ్చే కొన్ని ట్విస్టులు కూడా ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉన్నాయి. ఎక్కడా ల్యాగ్ లేకుండా స్పీడ్‌గా ఈ సినిమాను తెరకెక్కించాడు. మూవీ బిగినింగ్ నుంచి అలా వెళ్తూ ఉంటుంది. యాక్షన్‌, ఎమోషన్స్‌, రొమాన్స్‌తో ఫస్టాఫ్‌లో కథనం చాలా ఫాస్ట్‌గా సాగుతుంది. హీరో ఎంట్రీ.. టైటిల్‌ సాంగ్‌... హీరోయిన్లతో రొమాన్స్‌ అన్ని యూత్‌ని అట్రాక్ట్ చేసే విధంగా అల్లుకున్నాడు. ఇంటర్వెల్‌ ముందు ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్‌లో మాఫియా డాన్‌ ‘డర్టిఫెలో’ చుట్టే కథనం సాగుతుంది.క్లైమాక్స్‌లో జేపీ ఇచ్చే ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది. మాఫియా నేపథ్యంలో వచ్చే సినిమాల్లో డర్టీఫెలో ఓ డిఫరెంట్‌ మూవీ. స్క్రీన్‌ప్లేని ఇంకాస్త బలంగా ఎమోషనల్‌గా రాసుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో.
టెక్నికల్ పరంగా  సినిమా పర్వాలేదు. డాక్టర్‌. సతీష్‌ కుమార్‌ నేపథ్య సంగీతం ఆకట్టుకునే విధంగా ఉంది. టైటిల్‌ సాంగ్‌ సినిమాకే హైలెట్‌. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకి ప్రాణం పోశాడు సతీష్‌ కుమార్‌.  సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. పెట్టిన ప్రతి పైసా స్క్రీన్ పై కనిపిస్తోంది.

నటీనటుల విషయానికొస్తే..

సిద్దు, డర్టీ ఫెలొ పాత్రల్లో శాంతి చంద్ర చక్కగా ఒదిగిపోయాడు. నటనకు కొత్త అయిన రెండు కారెక్టర్ల మధ్య వేరియేషన్స్‌ను చూపించాడు. యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని యాంగిల్స్‌లోనూ మంచి ఈజ్ చూపించాడు. నాగి నీడు చాలా రోజుల తరువాత మంచి పాత్రతో మెప్పించాడు. సత్య ప్రకాష్ విలనిజం చాలా రోజులకు మళ్లీ తెరపై కనిపించింది. పోతురాజు పాత్ర బాగుంది. దీపిక సింగ్, సిమ్రిత్, నికిష రంగ్ ముగ్గురూ కూడా తెరపై గ్లామరస్‌గా కనిపించారు. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు రాణించారు.

రేటింగ్‌: 2.75/5

Read more: Swati maliwal: ఎన్నికల వేళ మరో బాంబు పేల్చిన స్వాతీమలీవాల్.. అసలేం జరిగిందంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

Trending News