Infertility : మనదేశంలో సంతానలేమి సమస్యతో బాధపడుతున్న భార్యాభర్తల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. గణాంకాల ప్రకారం ప్రస్తుతం 27.5 మిలియన్ల జంటలు సంతానలేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం 10-15 శాతం భార్యాభర్తలు సంతానోత్పత్తి సమస్యలతో బాధపడుతున్నారు అని అంచనా. దీనికి ముఖ్య కారణాలు మారుతున్న జీవనశైలి.. పెరుగుతున్న స్ట్రెస్ అనడంలో ఎటువంటి డౌట్ లేదు.
ప్రస్తుతం యువత తమ కెరీర్ మీద ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల పిల్లల్ని కనడం కాస్త వాయిదా వేస్తున్నారు. మరి ముఖ్యంగా సిటీస్ లో ఇలాంటి వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇలా వాయిదాలు వేయడం వల్ల వయసు పెరిగిన తర్వాత గర్భం దాల్చడం చాలా కష్టంగా మారుతుంది. సర్వే రిపోర్ట్ లో ప్రకారం ఇలా వాయిదాలు వేసే వారిలో సుమారు 54 శాతం మంది గర్భం దాల్చడానికి సమస్యలను ఎదుర్కొంటున్నారు.
కొంతమందికి గర్భధారణను ఎంతో సులభంగా జరుగుతుంది. మరి కొంతమందికి అది ఆలస్యం అవుతుంది. వయస్సు, అంతర్లీన ఆరోగ్య పరిస్థితులు, జీవనశైలి, జన్యువులు ఇలా సంతానోత్పత్తిని ప్రభావితం చేసే అంశాలు ఎన్నో ఉంటాయి. ముందు మనపై మనం అవగాహన తెచ్చుకోవడం ఎంతో ముఖ్యం.. మీరు ఎదుర్కొంటున్న సమస్యల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆ తర్వాత వాటికి సంబంధించిన పరిష్కారాన్ని అన్వేషించాలి. మహిళలలో ఎక్కువగా ఇప్పుడు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పిసిఒఎస్), ఎండోమెట్రియోసిస్, ఫెలోపియన్ ట్యూబుల్లో అడ్డంకులు ఏర్పడుతున్నాయి.
మహిళలలో తరచూ నెలసరి సమస్యలు ఎదురవుతూ ఉంటే ముందుగానే గుర్తించి డాక్టర్ ను సంప్రదించాలి. పురుషులలో ఎక్కువగా స్పెర్ము కౌంట్ తగ్గడం సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది.అంగస్తంభన రావడం, వృషణాలలో నొప్పి లేదా వాపు, వీర్య సమస్యలు ఉన్నవారికి సంతానోత్పత్తి సమస్యలు ఉంటాయి .మరి కొంతమందికి ఎటువంటి లక్షణాలు లేకుండా కూడా ఈ సమస్యలు ఉండే అవకాశం ఉంది.
మహిళలలో వయసు పెరిగే కొద్దీ శరీరం పిల్లలను కనేందుకు సహకరించదు. అందుకే గర్భం ధరించలేకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలి.కెఫిన్, ధూమపానం, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. అస్తవ్యస్తమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు.. కూడా కొన్ని సందర్భాలలో పిల్లలు కలగకుండా ఉండడానికి కారణాలు అవుతాయి. కాబట్టి పిల్లల కోసం ప్రయత్నించే జంటలు సహజమైన ఆహార పదార్థాలను తీసుకోవడం, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అలవాటు చేసుకోవడంతో పాటు జీవితంపై సానుకూల దృక్పథంతో ఉండాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook