Ajwain Water Health Benefits: ఆయుర్వేదపరంగా వాములో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దగ్గు, జలుబు చేసినప్పుడు వామును వాడుతాము. మన పూర్వికులు కూడా వామును ఉపయోగించేవారు. మన వంటింటి ఈ మందు కడుపు నొప్పి సమస్యకు కూడా చెక్ పెడుతుంది. కడుపులో అజీర్తి సమస్యకు చెక్ పెడుతుంది వాము. పరగడుపున వాము నీటిని తాగితే మన శరీరంలో ఏ మార్పులు జరుగుతాయి తెలుసా? పరగడుపున తీసుకోవడం వల్ల మన కడుపు ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
జీర్ణ ఆరోగ్యం..
వాము నీటిని తీసుకోవడం వల్ల మన జీర్ణక్రియకు ఒక ఆయుర్వేద మందు లా పని చేస్తుంది. ఇందులో థైమోల్ ఉంటుంది. వాము గ్యాస్ట్రిక్ సమస్యలకు చెక్ పెడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరిగేలా చేస్తుంది. కడుపులో అజీర్తి యాసిడిటీ సమస్య ఉన్నవారు తీసుకోవాలి. ఎండాకాలం కడుపు సంబంధిత సమస్యలు వాము నీటిని ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఇది రోజంతా మనం కడుపు ఆరోగ్యానికి కావాల్సిన ఖనిజాలను అందిస్తుంది.
అజీర్తికి రిలీఫ్..
ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల గ్యాస్ సంబంధిత సమస్యలకు చెక్ పెడుతుంది. ఉదయం టీ మాదిరి కూడా తీసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. వాము నీరు లేదా టీ రూపంలో తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.
ఇదీ చదవండి: టమాటో జ్యూస్ తాగితే మీకు తెలియకుండానే 5 ఆరోగ్య ప్రయోజనాలు..
డిటాక్సిఫికేషన్..
వాము నీటిలో డైరుటివ్ గుణాలు ఉంటాయి. ఇవి కడుపులోని విష పదార్థాలను మూత్ర విసర్జన ద్వారా బయటికి పంపిస్తాయి ప్రతిరోజు వాము నీటిని తీసుకోవాలి కడుపును నేచురల్‌గా డిటాక్సిఫై చేస్తుంది.
మెటబాలిజమ్ బూస్ట్..
వాము నీటిని తీసుకోవడం వల్ల మన బాడీ మెటబాలిజం మెరుగుపరుస్తుంది. వాము మన శరీర పనితీరును మంచిది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇవి క్యాలరీలను కరిగించేస్తాయి. దీంతో బరువు కూడా సులభంగా తగ్గిపోతారు వాము నీటిని టీ రూపంలో తీసుకోవడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు.
ఇదీ చదవండి: ఖాళీ కడుపున వెల్లుల్లి రసం తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?
వాము నీరు..
వాము రాత్రంతా నానబెట్టి ఉదయం ఆ నీటిని వడగట్టుకుని పరగడుపున తీసుకోవాలి. ఇది పేగు ఆరోగ్యానికి మంచిది
నాచురల్ గా మన శరీరానికి శక్తిని అందిస్తుంది. వాము తో తయారు చేసిన టీ ని తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వారికి ఎంతో ఉపయోగకరం.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి