Snake Bite: తలుపు చాటున నక్కిన అత్యంత విషపూరిత పాము.. చటుక్కున కాటేసింది

Snake Shocking Video While Opening Door: పాడుపడిన లేదా.. ఎప్పుడూ వినియోగించని వస్తువులు, డబ్బాల వెనుక ఒకసారి చూసి తెరవాలి. లేదంటే అక్కడ పాములు దాగి ఉండొచ్చు. లేదంటే తలుపుల వెనుక కూడా నక్కి ఉంటాయి. జాగ్రత్త

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 16, 2024, 02:32 PM IST
Snake Bite: తలుపు చాటున నక్కిన అత్యంత విషపూరిత పాము.. చటుక్కున కాటేసింది

Snake Shocking Video: ఏ పుట్టలో ఏ పాము ఉందో అని పెద్దలు చెబుతారు. అది ఒక సామెత అయినా నిజంగంటే ఏ పుట్టలో ఏ పాములు ఉంటాయో తెలియదు. ఇప్పుడు ఎక్కడ ఏ పాము ఉంటుందో.. తలుపు వెనుకాల.. బీరువాల వెనుకాల పాములు ఉంటున్నాయి. ఈ పరిస్థితి పట్టణ ప్రాంతాల్లో కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంది. ముఖ్యంగా కొంత అటవీ ప్రాంతం దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో పాములు ఇంట్లోకి దూరి వస్తుంటాయి. అదే మాదిరి ఓ ఇంట్లో తలుపు వెనుకాల ఓ పాము దూరింది. ఆ ఇంటి యజమాని తలుపు వేస్తుండగా చటుక్కున్న కాటు వేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది.

Also Read: Mutton Bone: పెళ్లి భోజనంలో ఇరుక్కున్న మటన్‌ ముక్క.. తాతయ్య తట్టుకోలేక ఆస్పత్రికి వెళ్లగా

అమెరికాలోని సౌత్‌ కరోలినా ప్రాంతంలో ఉన్న స్పార్టన్‌బర్గ్‌లో ఓ ఇల్లు ఉంది. ఆ ఇంటి ప్రధాన తలుపు వెనుకాల పాము నక్కి ఉంది. అయితే ఇది చూడని ఆ ఇంటి యజమాని బయటకు వెళ్తున్న సమయంలో ఇంటి తలుపును వేశారు. గొళ్లెం వేస్తుండగా చటుక్కున అతడి చేయిపై కాటు వేసింది. పాము కాటుతో అతడు భయభ్రాంతులకు గురయ్యాడు. వెంటనే చేతిని వెనక్కి లాగాడు. పాము కాటుతో నొప్పికి గురయి 'వామ్మో' అంటూ బయటకు పరుగులెత్తాడు.

Also Read: Bulandshahr: పాముకాటుతో మృతి.. బతుకుతాడనే ఆశతో మృతదేహాన్ని నదిలో ముంచిన కుటుంబం

ఇదంతా ఇంటికి అమర్చిన సీసీ కెమెరాలో రికార్డయ్యింది. కాటేసిన అనంతరం పాము బుసలు కొడుతూ కనిపించింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన వారంతా షాక్‌కు గురవుతున్నారు. పాము కాటు వేయడం ఎప్పుడూ చూడలేదని.. ఇలా కాటు వేస్తుందా? అని ఆశ్చర్యపోతున్నారు. తలుపుల వెనుకాల ఒకసారి చూసుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News