Prabhas: ఆ విషయంలో రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఘోర అవమానం.. తట్టులేకపోతున్న ఫ్యాన్స్..

Prabhas: అవమానం.. ఘోర అవమానం.. ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ 'సలార్' మూవీకి వచ్చిన టీఆర్పీ రేటింగ్ ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయమై రెబల్ స్టార్ ఫ్యాన్స్ నారాజ్‌గా ఉన్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : May 4, 2024, 08:31 AM IST
Prabhas: ఆ విషయంలో రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఘోర అవమానం.. తట్టులేకపోతున్న ఫ్యాన్స్..

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించిన మూవీ 'సలార్'. లాస్ట్ ఇయర్ చివర్లో విడుదలైన ఈ సినిమాతో ప్రభాస్ పవరఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఎపుడో థియేట్రికల్ రన్ ముగిసింది. మరోవైపు ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. రీసెంట్‌గా ఈ సినిమా స్టార్ మా ఛానెల్‌లో ప్రసారమైంది. ఇక ఈ సినిమా టీఆర్పీ రేటింగ్ వచ్చింది. మొదటి సారి ప్రసారమైన ఈ సినిమాకు 6.5 అతి తక్కువ రేటింగ్ వచ్చింది. ప్రభాస్ వంటి స్టార్ హీరో సినిమాకు టీవీలో ఈ రేంజ్ రెస్పాన్స్ రావడంపై ప్రభాస్ అభిమానులు ఒకింత షాక్‌లో ఉన్నారు. ఈ సినిమాకు ఈ రేంజ్ రేటింగ్ రావడంపై పలువురు పలు రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ సినిమాను చాలా మంది థియేటర్స్‌లో చూసారు. అక్కడ చూడని వారు ఓటీటీ వేదికగా చూసేసారు. ఇక ఈ సినిమా పూర్తిగా సీరియస్‌గా సాగడం వంటివి ఈ సినిమాను రిపీట్ రన్‌లో చూడడానికి ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. ఒక వేళ ఎంటర్టైన్మెంట్ కాస్త ఉన్నా..ప్రేక్షకులు ఈ సినిమాను టీవీల్లో చూడడానికి ఇష్టపడేవారు. ఈ మధ్యకాలంలో చాలా మంది ప్రేక్షకులు ఓటీటీ వేదికగానే ఎక్కువ చూస్తున్నారు. టీవీల్లో వచ్చినపుడు చూడటానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టం లేదు.

టీవీలో అయితే.. వాళ్లు చెప్పిన సమయానికి మధ్యలో యాడ్స్ చూస్తూ చూడాలి. అదే ఓటీటీ వేదిక అయితే.. మన ఇష్టమొచ్చిన టైమ్‌లో చూసే అవకాశం ఉంటుంది. అందుకే ఎక్కువ మంది ప్రేక్షకులు ఓటీటీలో తమకు తీరిక ఉన్న సమయాల్లో సినిమాలు చూస్తున్నారు. ఈ కారణాలన్ని టీవీల్లో పెద్ద సినిమాలకు టీఆర్పీ రాకుండా చేస్తున్నాయి. పైగా చాలా మంది రెగ్యులర్ కేబుల్ లేదా టాటా స్కై, సన్ నెట్‌వర్క్ వంటివి సాంప్రదాయ కేబుల్ నెట్‌వర్క్ పై ఆధారపడటం లేదు. చాలా మంది యూట్యూబ్ లేదా ఇతర మార్గాల్లో ఎంటర్టేనర్ అవుతున్నారు. ఇవన్ని పెద్ద సినిమాలను టీవీల్లో తక్కువ రేటింగ్ రావడానికి కారణం అని చెబుతున్నారు. ఈ సినిమా రెండో పార్ట్ సలార్ శౌర్యాంగ పర్వం షూటింగ్ ఈ నెలాఖరులో సెట్స్ పైకి వెళ్లనుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది. మరోవైపు 'ది రాజా సాబ్‌' మూవీతో పాటు హను రాఘవపూడి, సందీప్ రెడ్డి వంగా చిత్రాలను ఈ యేడాది చివర్లో మొదలు పెట్టనున్నాడు. మొత్తంగా ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.

Also read: Supreme Court: 'రాహుల్ గాంధీ' పేరుందని ఎన్నికల్లో పోటీ చేయోద్దంటే ఎలా ? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News