Pawan Kalyan OG : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో.. ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ఓజీ. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ ను సుజిత్ ఎలా చూపించబోతున్నాడు.. అని అభిమానులు కళ్ళుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా ఈ సంవత్సరం సెప్టెంబర్ లో విడుదలవుతుంది అని చిత్ర బృందం ప్రకటించింది.
మరోవైపు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా టీజర్.. ఈ మధ్యనే విడుదల కాగా.. అందులో హరిహర వీరమల్లు కూడా 2024 లోనే విడుదలవుతుంది అని ప్రకటించారు. ఒకే సంవత్సరంలో.. అది కూడా కేవలం మూడే మూడు నెలల గ్యాప్ తో.. రెండు పవన్ కళ్యాణ్ సినిమాలు రావడం అసాధ్యం. కాబట్టి ఈ రెండు సినిమాలలో ఏదో ఒకటి కచ్చితంగా వాయిదాపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ సమయం కాబట్టి.. జనసేన పార్టీ పనులతో చాలా బిజీగా గడిపేస్తున్నారు. ఒకవేళ జనసేన ఉమ్మడి పొత్తు గనక గెలిచి ఈసారి అధికారంలోకి వస్తే.. ఇక పవన్ కళ్యాణ్ కనీసం రెండు నెలలైనా షూటింగ్ లలో పాల్గొనే అవకాశం ఉండదు.
ఆ తరువాత మళ్లీ ఓజీ సినిమా షూటింగ్ పూర్తి చేయడానికి కనీసం నెల అయినా పడుతుంది. మరి అప్పటికప్పుడు సినిమా హడావిడిగా సెప్టెంబర్ లో విడుదలవుతుందా లేదా అనేది మాత్రం ఫాన్స్ కి డౌట్ గానే ఉంది.
మరోవైపు హరిహర వీరమల్లు సినిమాని డిసెంబర్ లో విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెప్పచ్చు. కాబట్టి ఓజీ సినిమా షూటింగ్ పూర్తయ్యాక.. పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేస్తారని టాక్. కానీ చూస్తూ ఉంటే రెండు సినిమాల నిర్మాతలు కలిసి.. పవన్ కళ్యాణ్ తో సినిమాలు పూర్తి చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నట్లు ఉంది.
నిజానికి హరి హర వీర మల్లు సినిమా చాలా కాలం క్రితమే విడుదల అవ్వాలి.. కానీ ఈ సినిమా షూటింగ్ ఏదో ఒక కారణంగా.. వాయిదా పడుతూ 2024 దాకా వచ్చింది. కాబట్టి కష్టమైన సమయం వస్తే పవన్ కళ్యాణ్ ఓజి కన్నా ముందు హరిహర వీరమల్లుకే డేట్ ఇస్తారా అని ఆలోచన కూడా నడుస్తోంది.. అలా జరిగితే ఓజి ఏకంగా వచ్చే సంవత్సరానికి పోస్ట్ పోన్ అవ్వడం ఖాయం. మొత్తానికి పవన్ కళ్యాణ్ రాబోయే సినిమాల విడుదల తేదీల పైన గందరగోళం నెలకొంది. ఇక వీటన్నిటి మధ్య హరీశ్ శంకర్ తో పవన్ కళ్యాణ్ చేయాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మాత్రం.. 2025 లేదా 2026 దాకా వాయిదా పడిపోయినట్లేని చెప్పకనే అర్థమైపోతోంది.
Also Read: KCR Ban: కేసీఆర్‌కు ఎన్నికల సంఘం ఝలక్.. 48 గంటల పాటు ప్రచారం నిషేధం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter