MI vs RCB Highlights: బౌలర్ల వైఫల్యం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు శాపంగా మారింది. బ్యాటర్లు దూకుడుగా ఆడి భారీ లక్ష్యం నిర్దేశిస్తున్నా ప్రత్యర్థులను కట్టడి చేయడంలో ఆర్సీబీ బెంగళూరు బౌలర్లు విఫలమవుతున్నారు. ఫలితంగా ఆర్సీబీ తాజా ఐపీఎల్ సీజన్లో ఐదో పరాజయాన్ని చవిచూసింది. ఫలితంగా ఈ సీజన్లో ప్లేఆఫ్స్ అవకాశాలను దాదాపుగా దూరం చేసుకున్నట్టు కనిపిస్తోంది. హ్యాట్రిక్ ఓటముల అనంతరం ముంబై రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. సొంత మైదానం వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఆల్ రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును .... వికెట్ల తేడాతో చిత్తు చేసి ఈ సీజన్లో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు సాధించింది. గత మ్యాచ్‌లో శతకం బాదిన విరాట్ కోహ్లీ (3) ఇక్కడ విఫలమవగా ఫాఫ్ డుప్లెసిస్ (61) సత్తా చాటాడు. రజత్ పాటిదార్ (50) అర్ధ శతకంతో రాణించాడు. విల్ జాక్స్ (8) అతి తక్కువ స్కోర్‌కు పరిమితమైన వేళ.. గ్లెన్ మాక్స్వెల్, మహిపాల్ లమ్రోర్, వైశాఖ్ విజయ్ కుమార్ డకౌట్లు అయ్యారు. జట్టు పరుగులు సాధించలేక గడ్డు పరిస్థితిలో ఉన్న సమయంలో దినేశ్ కార్తీక్ కొండంత అండగా నిలిచాడు. తనదైన బ్యాటింగ్‌తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 23 బంతుల్లో 53 స్కోర్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ముంబై ఇండియన్స్ బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగాడు. ఈ సీజన్లో జరిగిన మ్యాచ్‌ల్లో అత్యధికంగా 5 వికెట్లు తీసి తనకు తిరుగులేదని నిరూపించాడు. కేవలం 21 పరుగులు ఇచ్చి బెంగళూరును కట్టడి చేశారు. గెరాల్డ్ కాట్జీ, ఆకాశ్ మధ్వాల్, శ్రేయస్గోపాల్ చెరొక వికెట్ తీశారు.
Also Read: PBKS vs SRH Highlights: ఉత్కంఠ మ్యాచ్‌లో హైదరాబాద్ విజయం.. పంజాబ్ ఓటమి
పరుగులు రాబట్టకుండా బెంగళూరును ముప్పుతిప్పలు పెట్టిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్‌లో దుమ్మురేపింది. 196 లక్ష్యాన్ని ఏమాత్రం కష్టం లేకుండా సునాయాసంగా ముంబై ఛేదించింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 5 సిక్స్‌లు, 7 ఫోర్లతో రెచ్చిపోయి ఆడి 69 పరుగులు సాధించాడు. ఇషాన్‌కు రోహిత్ శర్మ స్ట్రైకింగ్ ఇస్తూనే 38 పరుగులు సాధించడం విశేషం. తర్వాత వచ్చిన సూర్య కుమార్ యాదవ్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఐదు ఫోర్లు, నాలుగు సిక్స్‌లతో 19 బంతుల్లోనే 52 పరుగులు చేసి గొప్ప ప్రదర్శన చేశాడు. హార్దిక్ పాండ్యా (21), తిలక్ వర్మ (16) మ్యాచ్‌ను ముగించారు.
జట్టు వరుస ఓటములకు కారణమైన బౌలర్లు ఇక్కడ కూడా అదే వైఫల్యం కనబర్చారు. స్పిన్నర్లు లేని బౌలింగ్ దళం ఆర్సీబీ ఓటములకు ప్రధాన కారణం. మహ్మద్ సిరాజ్ అదే వైఫల్యం కనబరుస్తూ ఒక్క వికెట్‌ను కూడా పడగొట్టలేకపోయాడు. ఆకాశ్ దీప్, విశాక్ విజయ్ కుమార్, విల్ జాక్స్ ఒక్కో వికెట్ తీశారు. బౌలర్ల అతి చెత్త ప్రదర్శనతో ముంబై 27 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter