Maruti Suzuki: కొత్త కార్లు కొనుగోలు చేసేవారి షాక్‌.. Swiftతో పాటు ఆ కార్ల ధరలు భారీగా పెంపు!

Maruti Suzuki: దేశీయ ఆటో మొబైల్‌ కంపెనీ మారుతి సుజుకి తమ కస్టమర్స్‌కి షాక్‌ ఇచ్చింది. కొన్ని కార్ల వేరియంట్స్‌కి సంబంధించిన ధరలను పెంచుతూ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఏయే కార్లపై ధరలు పెరిగాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 10, 2024, 05:47 PM IST
Maruti Suzuki: కొత్త కార్లు కొనుగోలు చేసేవారి షాక్‌.. Swiftతో పాటు ఆ కార్ల ధరలు భారీగా పెంపు!

Maruti Suzuki: ప్రముఖ భారత ఆటోమొబైల్‌ కంపెనీ మారుతి సుజుకి తమ కస్టమర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌ తెలిపింది. సంబంధింత కార్ల వేరియంట్స్‌పై భారీగా ధరలు పెంచిన్నట్లు వెల్లడించింది. ఈ ధరల పెరుగుదల నేటి (ఏప్రిల్ 10వ తేదీ) నుంచి అమల్లోకి అందుబాటులోకి రాబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. మారుతి సుజుకి స్విఫ్ట్‌తో పాటు గ్రాండ్ విటారా సిగ్మా వేరియంట్స్‌పై పెరిగిన ధరలు ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చాయి.  స్విఫ్ట్ కార్ల అన్ని వేరియంట్స్‌పై రూ.25,000 పెంచగా గ్రాండ్ విటారా సిగ్మా వేరియంట్ ధరలను రూ.19,000 పెంచినట్లు కంపెనీ బుధవారం వెల్లడించింది.

అంతేకాకుండా మారుతి సుజుకి ఈ ఏడాది ప్రారంభ నెల జనవరిలోనే అన్ని రకాల మోడల్స్‌పై ధరలను దాదాపు 0.45% పెంచింది. అయితే ద్రవ్యోల్బణం కారణంగా, వస్తువుల ధరల పెరగడం కారణంగా ఈ ధరలను పెంచిన్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే వచ్చే సంవత్సరంలో కూడా మరింత ధరలు కూడా పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కార్ల ధరలు పెరగడం కారణంగా వచ్చిన కొన్ని వార్తలతో మారుతీ సుజుకీ షేర్లు క్షీణించాయి. బుధవారం మారుతీ సుజుకీ షేర్లు 1.90 శాతం పడిపోయి.. రూ.12,643.05 వద్ద ట్రేడ్‌ అయ్యాయి. అయితే భవిష్యత్‌లో మరింత క్షీణించే అవకాశాలు కూడా ఉన్నట్లు నిపుణులు అంచనాలు వేస్తున్నారు. 

FY 2023-24లో మార్కెట్‌లో మారుతీ సంచనం సృష్టించింది:
ప్రముఖ ఆటో మొబైల్‌ మారుతి సుజుకి కంపెనీ FY 2023-24 సంవత్సరంలో మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. కంపెనీ మార్చి నెలలోనే దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లతో కలిపి దాదాపు 187,196పైగా యూనిట్లను విక్రయించిన్నట్లు తెలిపింది. 2023 సంవత్సరం మార్చి నెలతో పోలిస్తే.. విదేశీ విక్రయాలు 14 శాతం పుంజుకుని 156,330 యూనిట్లకు చేరుకుందని కంపెనీ వెల్లడించింది. అలాగే కంపెనీ 4,974 యూనిట్ల పరికరాలను కూడా విక్రయించిన్నట్లు సమాచారం. దీంతో పాటు 25,892 యూనిట్లను ఎగుమతి చేనిన్నట్లు కూడా కంపెనీ వెల్లడించింది.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

మారుతీ సుజుకి కంపెనీ సంవత్సరం వారిగా అమ్మకాలను చూస్తే.. ఆర్థిక సంవత్సరం (FY) 2023-24లో అత్యధికంగా విక్రయించిన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు  2,135,323 యూనిట్లకుపైగా అమ్మకాలు జరిపిన్నట్లు వెల్లడించింది. దీంతో భారతదేశ వ్యాప్తంగా 1,793,644 యూనిట్ల విక్రయాలను జరిపితే, ఇతర దేశాల ఎగుమతుల ద్వారా 283,067 యూనిట్లకుపైగా అమ్మకాలు జరిపినట్లు సమాచారం. 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News