Huzurabad MLA Padikaushik Reddy Fires On Minister Ponnam Prabhakar: మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ఆవేశం స్టార్ అని, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడికౌశిర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మంత్రి పొన్నం మాట్లాడే విధానం మార్చుకొవాలని హితవు పలికారు. ఇటీవల మంత్రి పొన్నం..ఎమ్మార్వో, ఆర్డీవో లను కాన్ఫరెన్స్ కాల్ చేసి ఎమ్మెల్యే చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను ఇచ్చేది లేదన్నారు.ఈ ఘటన వైరల్ గా మారింది. దీంతో మంత్రి ప్రభాకర్ ఘటనపై సీరియస్ అయ్యారు. వెంటనే.. ఎమ్మార్వో, ఆర్డీవో లపై చర్యలు తీసుకొవాలని సీఎస్ కు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు. దీనిపై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మంత్రి పొన్నంను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
Read More: Girls Romance In Metro: మెట్రోలో ముద్దులు పెట్టుకుంటూ అమ్మాయిల రొమాన్స్..
అమాయకులైన ఆర్డీవో, ఎమ్మార్వోలను ఎందుకు బలిచేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ఆర్డీవో, ఎమ్మార్వోలకు ఒక్క ఫోన్ కాల్ ఉన్నకూడా.. తన పదవికి రాజీనామా చేస్తానని, ప్రభుత్వం మీదే కదా.. దీనిపై విచారణ చేయించుకొవాలని సవాల్ విసిరారు. ఈ ఆడియో లీకైంది పొన్నంఆఫీసు నుంచని, ఆర్డీవోలకు దీనిలో ఎలాంటి సంబంధంలేదని అన్నారు. నీ ఆఫీసులో ఏమౌతుందో నీకు తెలియకుంటే, ప్రజలకు ఏం న్యాయం చేస్తావంటూ ఎమ్మెల్యే పాడికౌశిర్ రెడ్డి మండిపడ్డారు.
అదే విధంగా హుజురాబాద్ నుంచి ఒక వ్యక్తి తిరుపతి గౌడ్ అనే వ్యక్తి మంత్రి పొన్నంకు కాల్ చేస్తే.. బూతులు తిడుతూ రెచ్చిపోయాడని అన్నారు. ఈ వీడియోను కూడా ఎమ్మెల్యే పాడికౌశిర్ రెడ్డి సోషల్ మీడియాలో విడుదలచేశారు. ఇందులో ముడ్డి బొక్క బలగొడతా.. , అంటూ మంత్రి పొన్నం రెచ్చిపోయారు.
Read More: Elephant Attacks: టూరిస్టులకు బిగ్ షాక్.. సఫారీట్రక్ ను ఎత్తిపాడేసిన ఏనుగు..వైరల్ వీడియో..
కరీంగనగర్ ప్రజలు ఇలాంటి పనులు చేయడం వల్ల ఓడించి బుద్ది చెప్పారని కౌశిక్ రెడ్డి అన్నారు. మంత్రి పొన్నంతో బూతుపురాణాలు, ఈయన ఏంమాట్లాడుతారో..ఆయనకే అర్థంకాదని వెల్లడించారు. మంత్రి పదవిలో ఉండి బూతుపురాణం మాట్లాడకుండా.. ప్రజలకు మేలు చేసేపనులు చేయాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మంత్రి పొన్నంకు హితవు పలికారు. మంత్రి పొన్నం మాటలను అధికారులు వింటే కుక్కతొక పట్టుకుని గోదావరి ఈదినట్లే అని కౌశిక్ రెడ్డి అన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook