Darshini: సరికొత్త సోషియో ఫాంటసీ కాన్సెప్ట్‌తో వస్తోన్న 'దర్శిని' మూవీ .. ప్రమోషన్స్‌లో జోరు..

Darshini: V4 సినీ క్రియేషన్స్ బ్యానర్ పై డాక్టర్ ఎల్.వి.సూర్యం నిర్మాతగా, డాక్టర్ ప్రదీప్ అల్లు డైరెక్షన్‌లో వస్తోన్న సినిమా 'దర్శిని'. ఈ సినిమాతో జీ.కే.వికాస్, శాంతి హీరో హీరోయిన్లుగా పరిచయం కాబోతున్నారు. సోషియో ఫాంటసీ ప్లస్ సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ సినిమాను త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 22, 2024, 09:22 AM IST
Darshini: సరికొత్త సోషియో ఫాంటసీ కాన్సెప్ట్‌తో వస్తోన్న 'దర్శిని' మూవీ .. ప్రమోషన్స్‌లో జోరు..

 Darshini: ఈ మధ్యకాలంలో తెలుగులో కొత్త వాళ్లతో సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న చిత్రాలకు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ కోవలో వికాస్.జీకే, శాంతి నాయికా నాయకులుగా తెరకెక్కతున్న చిత్రం 'దర్శిని'. ఇప్పటి వరకు తెలుగు తెరపై రానీ సరికొత్త సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ సినిమా రాబోతుంది. ఇప్పటికే షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీటైన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శని మూవీ టీమ్ వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజినీరింగ్ కాలేజ్ లో యూత్ ఫెస్ట్ Sintillashunz లో పాల్గొన్నారు.
ఈ సందర్భం గా దర్శకుడు డాక్టర్  అల్లు ప్రదీప్ మాట్లాడుతు ఈ సినిమా యువతు ఆకట్టుకునే విధంగా ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమాలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని చెప్పారు.  ఇక ఈ సినిమా నిర్మాత డాక్టర్ ఎల్.వి.సూర్యం మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. అంతేకాదు ఈ సినిమా విజయం సాధించడం పక్కా అని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇక సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న జీ.కే.వికాష్ మాట్లాడుతూ.. తొలి సినిమాలోనే ఇలాంటి మంచి పాత్ర దక్కడం తన అదృష్టమన్నారు. యూత్ తలుచుకుంటే ఏదైనా సాధిస్తారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్ లుక్, సాంగ్స్, టీజర్ అన్ని ప్రేక్షకులను మెప్పించాయి. సినిమా కూడా తప్పకుండా విజయం సాధిస్తుందనే ఆషాభావం వ్యక్తం చేసారు. అందకు మీ అందరి సపోర్ట్ కావాలని కోరారు. ఈ సందర్భంగా చిత్ర నటీనటులు, టెక్నిషియన్స్ అక్కడున్న ప్రేక్షకులతో మాటామంతీ నిర్వహించారు. డాన్సులతో అలరించారు. స్టూడెంట్స్ అందరు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఈ సినిమాకు నిజాని అంజన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఈ సినిమాను విడుదల తేదిని అనౌన్స్ చేయనున్నట్టు ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తెలిపింది.

Also Read: Arvind Kejriwal: మద్యం కుంభకోణంలో అనూహ్య మలుపు.. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News