/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Summer Home Tips: మండే ఎండకాలాన్ని తట్టుకోలేక ఏసీలను ఫ్యాన్‌లను ఆశ్రయిస్తాంం. ఈ కాలంలో అందరి ఇళ్లలో కూడా ఏసీలు కనిపిస్తున్నాయి. రానురాను ఎండ వేడిమి కూడా ఆ రేంజ్‌లోనే ఉండనుంది కూడా. అయితే, ఏసీలు ఉన్నా కొంతమంది ఫ్యాన్ ఆన్ చేస్తారు. ఈ రెండు ఇలా కలిపి ఆన్ చేస్తే కరెంట్ ఎక్కువగా కాలుతుందా? ఎప్పుడైనా ఆలోచించారా?సాధారణంగా ఈ మండే వేసవికాలంలో మనం ఇంట్లో ఉన్న ఫ్యాన్ ఆన్‌ చేస్తే ఇంటి నలుమూలకు గాలి వస్తుంది కానీ, అది వేడిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మీరు ఏసీ ఆన్‌ చేస్తే ఫ్యాన్ ఆన్ చేయకూడదు. ఒకవేళ ఫ్యాన్ గాలికి కూడా మీరు ఉండగలిగితే మరీ మంచిది అప్పుడు ఏసీ ఆన్‌ చేయకండి. ఉదయం లేవగానే మీరు గది డోర్లు, కిటికీలను ఓపెన్ చేసి ఉంచండి. కానీ, టెంపరేచర్ పెరిగినప్పుడు మాత్రం వాటిని మూసేయండి.

అంతేకాదు ఏసీ ఆన్‌ చేసినా.. ఫ్యాన్ ఆన్‌ చేసినా ఇంటి డోర్లు కిటికీలను మూసి ఉంచండి. అప్పుడు గది ఉష్ణోగ్రత చల్లగా ఉంటుంది. లేకపోతే వాటి గాలి బయటకు వెళ్లిపోతుంది. త్వరగా గది ఉష్ణోగ్రత చల్లబడదు. మీరు ఒకవేళ ఏసీ, ఫ్యాన్ రెండూ కలిపి ఆన్ చేయాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.ముందుగా ఎండకాలం మొదలయ్యే ముందు, ఎండకాలం ముగిసిపోయిన తర్వాత ఏసీలను ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించాలని గుర్తుంచుకోండి. అప్పుడే కరెంట్‌ బిల్ తక్కువగా వస్తుంది. ఏసీ కూడా ఎక్కువ కాలం పాటు మన్నికగా ఉంటుంది. లేకపోతే మీరు కరెంటు బిల్లు వేలలో చెల్లించాల్సి ఉంటుంది.

అంతేకాదు ఫ్యాన్ విషయానికి వచ్చినా దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటుంది. సాధారణంగా ఫ్యాన్లను మనం తరచూ శుభ్రం చేయలేం. ఎందుకంటే అది ఎత్తులో ఉంటుంది. మన బిజీ లైఫ్‌లో కాస్త సమయం దొరికినప్పుడు మాత్రమే క్లీన్ చేస్తాం. అయితే, కొన్ని చిట్కాలను అనుసరించి సులభంగా ఫ్యాన్ శుభ్రం చేసుకోవచ్చు అది ఎలా తెలుసుకుందాం.ఫ్యాన్ శుభ్రం చేయాలనుకుంటే దానికి ఓ సులభమైన చిట్కా ఉంది. ఓ పాత దిండు కవర్ తీసుకోవాలి. దాన్ని ఫ్యాన్ రెక్కలకు తొడిగించాలి. ముందుగా ఫ్యాన్ స్విచ్ ఆఫ్ ఉందా? లేదా? చెక్ చేయాలి. ఆ తర్వాత దిండు కవర్ సాయంతో ఫ్యాన్ రెక్కలను బాగా రుద్ది శుభ్రం చేసుకోవాలి. దాని డస్ట్‌ మొత్తం దిండు కవర్లో ఉండిపోతుంది. దీంతో ఇల్లు మొత్తం మురికి పేరకుండా ఉంటుంది.

ఇదీ చదవండి:  పచ్చిమిర్చి ఎక్కువకాలంపాటు పాడవ్వకుండా ఉండాలంటే ఇలా నిల్వ చేయండి..

ఎండకాలం ముందే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్యాన్ నుంచి శబ్దం ఎక్కువగా వచ్చినా సమస్య ఏందో తెలుసుకోని సరిచేయించుకోవాలి. లేకపోతే నిద్ర కూడా సరిగ్గా పట్టదు. కండెన్సర్ సరిగ్గా పనిచేస్తేనే ఫ్యాన్ స్పీడ్‌గా తిరుగుతుందని గుర్తుంచుకోండి. ఇలా ముందస్తు సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఇంటిని చల్లగా ఉంచవచ్చు.

ఇదీ చదవండి: పదోతరగతి బోర్డుపరీక్షలు రాసే విద్యార్థులు.. మీ డైట్ ఇలా ఉంటే ఏకాగ్రత పెరుగుతుంది..

అయితే, ఏసీ,ఫ్యాన్ రెండూ కలిపి ఆన్ చేస్తే పవర్ బిల్ ఎక్కువగా వస్తుంది. ఒకవేళ మీరూ రెండూ ఆన్ చేయాలనుకుంటే ఏసీ టెంపరేచర్ 24 లేదా 25 లేదా 27 సెట్ చేసుకోండి. కానీ, ఫ్యాన్ స్పీడు మాత్రం స్లోగా ఉండాలి. ఇలా చేయడం వల్ల గది ఉష్ణోగ్రత్త త్వరగా చల్లబడుతుంది. ఇలా చేస్తే పవర్ ఖర్చు తక్కువ అవుతుంది. అంటే, మీరు నిరంతరంగా ఆరు గంటలు ఏసీ వాడితే 12 యూనిట్ల వరకు ఖర్చు అవుతే పైన చెప్పిన విధంగా ఏసీ, ఫ్యాన్ కలిపి ఆన్ చేస్తే కేవలం ఆరు యూనిట్లు మాత్రమే ఖర్చవుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
what happens if you run ac and ceiling fan at a time during summer rn
News Source: 
Home Title: 

Summer Tips: ఏసీ, ఫ్యాన్ రెండూ కలిపి ఆన్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
 

Summer Tips: ఏసీ, ఫ్యాన్ రెండూ కలిపి ఆన్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
Caption: 
Summer Home Tips
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Summer Tips: ఏసీ, ఫ్యాన్ రెండూ కలిపి ఆన్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
Renuka Godugu
Publish Later: 
No
Publish At: 
Thursday, March 21, 2024 - 13:41
Created By: 
Renuka Godugu
Updated By: 
Renuka Godugu
Published By: 
Renuka Godugu
Request Count: 
19
Is Breaking News: 
No
Word Count: 
421