Diabetes Symptoms: షుగర్ వ్యాధి ఒక్కసారి వస్తే అది ఎప్పటికీ తగ్గదు. ఎక్సర్‌సైజ్, లైఫ్‌స్టైల్ మార్పులతో దాన్ని బ్యాలన్స్ చేయడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. డయాబెటిస్ ప్రారంభంలో శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. దీంతో మీకు షుగర్ జబ్బు వచ్చినట్ల నిర్ధారించుకోవచ్చు. ఆ లక్షణాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మనం చెప్పుకోబోయే లక్షణాలు ఏ ఒక్కటి కనిపించినా డయాబెటిస్ లక్షణమే. అయితే షుగర్ వ్యాధి నుండి తప్పించుకోవచ్చు. ఈ రోజుల్లో చిన్నాపెద్దా అని తేడా లేకుండా అందరికి షుగర్ వ్యాధి వచ్చేస్తుంది. అయితే షుగర్ మొదటి స్టేజ్ లోనే పసిగడితే ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. వీటిలో ఏ లక్షణాలు మీలో ఉంటే ఓసారి చెక్ చేసుకోండి.
ఇదీ చదవండి: నేరేడు పండు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే నేటి ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన అనారోగ్య సమస్య వస్తుంది. అయితే వీటిని సూచిస్తూ మన శరీరం ముందు కొన్ని అనారోగ్య లక్షణాలు మనకు చెబుతుంది. అలాంటి వాటిలో డయాబెటిక్ కూడా ఒకటి. రక్తం లో చక్కెరలు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల ఇన్సులిన్ సరిగా ఉత్పత్తి కాక ఒకవేళ ఉత్పత్తి అయినా సరేనా దాన్ని ఉపయోగించుకోలేకపోవడం వల్ల నిత్యం శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవడం వల్ల కూడా షుగర్ వ్యాధి వస్తుంది. ఇది వచ్చే క్రమంలో మనకు ముందుగానే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇదీ చదవండి: గ్యాక్ ఫ్రూట్ తినడం వల్ల కలిగే ఉపయోగాలు
దీని వల్ల ఎంతో కొంత జాగ్రత్త పడేందుకు అవకాశం ఉంటుంది. షుగర్ వ్యాధి ఉంటే నోరంతా పొడిగా ఉంటుంది. దీంతో పాటు దాహం ఎక్కువగా వేస్తుంది. సాధారణంగా రాత్రి సమయం మాత్రమే కాదు ఉదయం పూట కూడా మూత్రానికి ఎక్కువసార్లు వెళ్తారు. సాధారణంగా రాత్రిపూట ఈ లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించవచ్చు. నిత్యం శారీరక శ్రమ వ్యాయామం చేసేవారు, పనిచేసేవారు అలసిపోతుంటారు. అలాంటి వారు తమ రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగాయని అర్థం చేసుకోవాలి. ఎల్లప్పుడూ శక్తి లేనట్టు నీరసంగా నిస్సత్తువగా ఉంటే వెంటనే షుగర్ స్థాయిలను చెక్ చేయించుకోవాలి. అవసరమైతే వైద్యులను సంప్రదించాలి. ఎక్కువగా చర్మంపై దురద వస్తున్నా, దురద పెరుగుతున్నా రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని తెలుసుకోవాలి. షుగర్ ఉంటే జీర్ణక్రియ కూడా మెరుగుపడదు. కొంతమందికి తరచూ ఆకలి కూడా వేస్తుంది. ఇంకా కాళ్లల్లో తిమ్మిరి వస్తుంది. ఏవైనా పండ్లు శరీరంపై ఉంటే అవి త్వరగా మానవు. అంతేకాదు ఏదైనా గాయం అయినా త్వరగా తగ్గిపోదు. ఇది కూడా మనం సులభంగా గుర్తించగలిగే షుగర్ లక్షణం. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Diabetes Symptoms: ఈ లక్షణాలు కనిపిస్తే మీకు షుగర్ వ్యాధి వచ్చినట్లే.. ఇలా జాగ్రత్తపడకపోతే ప్రమాదమే..!