Mallu Bhatti Vikramarka Reacts On Yadadri Sitting Controversy: తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, డిప్యూటీ సీఎం మల్లు భట్టీ విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం కోసం వెళ్లారు. ఆలయ అధికారులు సీఎంను, మంత్రులను పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అంతే కాకుండా స్వామి వారి దర్శనం అనంతరం పండితులు, కాంగ్రెస్ నేతలకు వేదాశీర్వచనం అందించే కార్యక్రమం ప్రారంభించారు. అప్పుడు.. సీఎం దంపతులు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు కూర్చీలపై కూర్చున్నారు.
డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క కింద స్టూల్ మీద కూర్చున్నారు. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. ఇది భట్టీని కావాలని అవమానపర్చేలా చేశారని కూడా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ కు పాల్పడ్డారు. అంతేకాకుండా.. దొరల పాలన అంటే ఇదేనని, సీఎం రేవంత్ టార్గెట్ గా బీఆర్ఎస్ పాలనను ఎండగడుతూ ట్రోల్స్ చేశారు. ఇదేనా మీ సమానత్వం అంటూ ఏకీపారేశారు.
దేవస్థానంలోనే ఒక ముఖ్యమంత్రిని కింద కూర్చుండబెట్టడం ఏంటని కూడా ఘాటువ్యాఖ్యలు చేశారు. దీనిపై తాజాగా, డిప్యూటీ సీఎం క్లారిటీ ఇచ్చారు. తాను కావాలని చిన్న పీటపై కూర్చున్నానని డిప్యూటీ సీఎం భట్టీ అన్నారు. మీ మనస్సు బాధపడిండ వచ్చు.. కానీ ఇది కావాలని చేసిందిమాత్రం కాదన్నారు. అంతేకాకుండా... తాను డిప్యూటీ సీఎంగా తెలంగాణను శాసిస్తున్నానని, ఆర్థిక, విద్యుత్, ప్రణాళిక శాఖలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ రాష్ట్రాంలో అనేక ప్రణాళికలు, విధానపరమైన నిర్ణయాలలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు భట్టీ క్లారిటీ ఇచ్చారు. దీనిపై కొందరు కావాలనే కాంగ్రెస్ కు అపఖ్యాతి వచ్చేలా ట్రోలింగ్ కు పాల్పడుతున్నారని అన్నారు. తమ పార్టీలో బేధిభిప్రాయాలు క్రియేట్ చేసి, లాభం పొందాలని చూస్తున్నారన్నారు. కానీ అలాంటిది ఏమి లేదని, ఇలాంటి రాజకీయాలు మానుకోవాలని భట్టీ హితవు పలికారు. ఈ ఘటన మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter