Australia: ఆస్ట్రేలియాలో తెలంగాణకు చెందిన వివాహిత దారుణ హత్య గురయ్యారు. ఆమెను హత్య చేసి చెత్తబుట్టలో పడేశారు. దుర్వాసన వచ్చి పోలీసులు పరిశీలించగా మహిళా మృతదేహం లభించింది. చెత్తబుట్టలో ఆమె శవమై కనిపించారు. కొద్దిరోజుల కిందటే ఆస్ట్రేలియా వెళ్లగా అంతలోనే ఆమె మరణించడం కుటుంబసభ్యులను దిగ్భ్రాంతికి గురిచేసింది. భర్త ఆమెనే హత్య చేశాడని తెలిసింది. భార్యను చంపేసి ఆయన ఎంచక్కా హైదరాబాద్ వచ్చేశాడు. ఈ హత్య కేసులో పలు సంచలన విషయాలు ఉన్నాయి.
Also Read: Australia: ట్రెక్కింగ్ చేస్తూ కాలుజారి లోయలో పడి ఏపీ వైద్యురాలు మృతి.. ఆస్ట్రేలియాలో ఘటన
హైదరాబాద్‌కు చెందిన మాదగాని బాల్శెట్టి గౌడ్ కుమార్తె చైతన్య అలియాస్ శ్వేత తన భర్త అశోక్ రాజ్, మూడేళ్ల బాబుతో కలిసి ఇటీవల ఆస్ట్రేలియాకు వెళ్లింది. విక్టోరియా రాష్ట్రంలోని పాయింట్ కుక్ సమీపంలోని మిర్కావేలో వీరు నివసిస్తున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ వారి ఇంటికి 86 కిలోమీటర్ల దూరంలోని మౌంట్ పొల్లాక్లో రోడ్డు పక్కన చెత్తబుట్టలో శవమై చైతన్య కనిపించింది. స్థానికులు ఆమె మృతదేహాన్ని పరిశీలించి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అక్కడి పోలీసులు విచారణ చేపడుతున్నారు. చైతన్య ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. అయితే చైతన్య ఇంటి పక్కనవాళ్లు కొన్ని వివరాలు చెప్పారు. 'చైతన్య చాలా మంచి వ్యక్తి. అందరితో కలివిడిగా ఉంటుంది' అని చెప్పారని సమాచారం.
Also Read: KN Rajannna: జై పాకిస్థాన్ అనే కొడుకుల్ని కాల్చి చంపాలి: మంత్రి సంచలన వ్యాఖ్యలు
భర్తపైనే అనుమానాలు
ఈ దారుణహత్య వెనుక ఆమె భర్త అశోక్ రాజ్ ఉన్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. భర్తనే ఆమెను హతమార్చి ఉంటాడని అక్కడి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. భార్యను చంపిన అనంతరం హైదరాబాద్ వచ్చి కుమారుడిని అత్తింట్లో వదిలి వెళ్లాడని తెలుస్తోంది. అనంతరం మళ్లీ ఎలాంటి అనుమానం లేకుండా ఆస్ట్రేలియా తిరిగి వెళ్లాడు. దీంతో చైతన్య కుటుంబసభ్యులు అశోక్ రాజ్ వ్యవహారంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో విచారణ ప్రారంభించిన ఆస్ట్రేలియా పోలీసులు భర్త అశోక్ రాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. అసలు ఏం జరిగిందో కనుక్కునే పనిలో ఉన్నారు. మృతురాలి కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఏఎస్ రావ్ నగర్లో నివసిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter