Papa movie: ధ‌మాకా డైరెక్ట‌ర్ త్రినాథ‌రావు నక్కిన చేతులు మీదుగా పాప ట్రైల‌ర్ లాంఛ్..

Papa movie:తెలుగులో కామెడీ కమ్ యాక్ష‌న్ చిత్రాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు న‌క్కిన త్రినాథ రావు. ధ‌మాకా మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న ఈ ద‌ర్శ‌కుడు తాజాగా అంతా కొత్త‌వాళ్ల‌తో తెర‌కెక్కిస్తోన్న పాప మూవీ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 8, 2024, 11:33 PM IST
Papa movie: ధ‌మాకా డైరెక్ట‌ర్ త్రినాథ‌రావు నక్కిన చేతులు మీదుగా పాప ట్రైల‌ర్ లాంఛ్..

Papa movie:గ‌త కొన్నేళ్లుగా తెలుగులో విభిన్న క‌థా చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాయి. ఈ కోవ‌లో క‌విన్, అప‌ర్ణ దాస్, మోనిక చిన్నకోట్ల, ఐశ్వర్య, భాగ్యరాజ్ మరియు వి టి వి గణేష్ లీడ్ రోల్లో యాక్ట్  చేశారు.   గణేష కె బాబు దర్శకత్వం వ‌హించారు. ఎస్ అంబేత్ కుమార్ సమర్పిస్తున్నారు. తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన దా..దా.. మూవీ నీరజ సమర్పణలో పాన్ ఇండియా మూవీస్, జెకె ఎంటర్టైన్మెంట్స్ పై ఎం. ఎస్. రెడ్డి తెలుగులో  చిత్రాన్ని పా.. పా..గా డ‌బ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.  ఈ  మూవీకి  సంబంధించిన ట్రైలర్‌ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాధ రావు నక్కిన విడుద‌ల చేశారు.

ఈ సందర్భంగా  డైరెక్టర్ త్రినాధరావు నక్కిన మాట్లాడుతూ..

మాములుగా  ప్ర‌తి సినిమాకి ట్రైలర్ చూపిస్తే వచ్చి మాట్లాడి వెళ్ళిపోతుంటాము. కానీ ఈ సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన దా..దా.. తెలుగులో పా..పా.. గా మన ముందుకు తీసుకొస్తున్నారు. ఈ దా..దా.. సినిమాని తమిళంలో ప్రొడ్యూసర్ ఎం.ఎస్. రెడ్డి నాకు చూపించారు. ఎంతో బాగా న‌చ్చింది.  దా..దా.. అంటే నాన్న తెలుగులో పా..పా.. అంటే ఏంటి అన్నాను పా..పా.. అంటే కూడా నాన్న అన్నారు. ఈ సినిమా రైటర్ మరియు డైరెక్టర్ గణేష్ కె బాబు ప్రతి సీను చాలా బాగా  రాసుకున్నారు. అంతేకాదు దాన్ని అంతే అద్బుతంగా తెర‌పై ఆవిష్క‌రించారు.  తన రైటింగ్ స్టైల్ చాలా బాగా నచ్చింది. ఇది ఒక నాన్న కథ మాత్రమే కాదు ఒక స్నేహితుడు కథ ఒక ఒక అమ్మ కథ ఒక లవర్ స్టోరీ. రెండు షేడ్స్ లో హీరో కవిన్ పాత్ర బాగుంది.  హీరో హెయిర్ స్టైల్ దగ్గర నుంచి బాడీ లాంగ్వేజ్ దాకా ప్రతిదీ చాలా కేర్ తీసుకుని తెర‌కెక్కించారు. ఈ సినిమా నేను చూసి ఎమోష‌న‌ల్ అయ్యాను.  కాబట్టి అంత కాన్ఫిడెంట్ గా చెబుతున్నాను.  నాకు చాలా బాగా నచ్చిన సినిమా ఇది. ఈ సినిమాలో మ్యూజిక్ బాగుంటుంది ఫోటోగ్రఫీ అద్భుతం. ఈ  జనరేషన్ కి తగ్గట్టుగా ట్రెండీగా ఈ సినిమా  ఉంటుంది. ప్రేక్ష‌కులు ఈ సినిమా చూసి కొత్త అనుభూతికి లోన‌వుతారు. ఆడియ‌న్స్ కూడా ఈ సినిమాను ఆద‌రిస్తార‌న్న న‌మ్మ‌కం ఉంద‌న్నారు.  

నిర్మాత ఎంఎస్ రెడ్డి మాట్లాడుతూ ..
న‌క్కిన త్రినాథ‌రావు ద‌ర్శ‌కుడుగా ఎంత బిజీగా ఉన్నా.. మా ఆహ్వానం అందుకొని ఈ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌కు రావ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌న్నారు.  కమర్షియల్ డైరెక్టర్‌గా ధమాకా, నేను లోకల్ వంటి చిత్రాలను ఈయ‌న నుంచి వ‌చ్చి ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందాయి. అలాంటి త్రినాధరావు నక్కినకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ‌జేసారు నిర్మాత‌.  గతంలో సాహసం చేయరా డింభక అనే మూవీతో మీ ముందుకు వచ్చాం. ఇప్పుడు ఈ పా..పా.. సినిమాతో  రాబోతున్నాము.  అతి త్వరలో ఉగాది శుభాకాంక్షలు తో ఆత్రేయపురం ఆణిముత్యం అనే సినిమా ఫ‌స్ట్ లుక్‌తో వ‌స్తున్నాం. ఈ మూవీతో మణికంఠ అనే ఒక కొత్త దర్శకుడిని టాలీవుడ్ సినీ ఇండ‌స్ట్రీకి  పరిచయం చేయబోతున్నాను. ఈ దా..దా.. సినిమాని 50 రోజుల తర్వాత థియేటర్లో చూశాను. అప్పటికి 70 శాతం హౌస్‌ఫుల్స్ తో న‌డుస్తోంది. ఈ మూవీ చూసిన వెంటనే నచ్చి యుఎస్ లో ఉన్న నా ఫ్రెండ్స్ శ్రీకాంత్, శశాంక్ కి కాల్ చేసి చెప్పాను.  ఒక మంచి సినిమా చూశాను అని. చెప్పగానే వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి ఈ సినిమాని తెలుగులో డ‌బ్ చేసి తీసుకొద్దామన్నారు. అతి త్వరలో ఈ సినిమాని తెలుగు ప్రేక్ష‌కుల‌ ముందుకు తీసుకు వస్తున్నాము. ఈ సినిమాని ఆదరించి మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాన‌న్నారు.

Also Read: Sharwanand Baby Girl: బర్త్‌ డే నాడే హీరో శర్వానంద్‌కు డబుల్‌ ప్రమోషన్‌.. 'అద్భుతం' పక్కన చేరింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News