Penukonda TDP Meeting: ఎన్నికలకు సమయం ముంచుకొస్తుండడంతో తెలుగుదేశం పార్టీ ప్రచారంలో వేగం పెంచింది. ఈ క్రమంలోనే 'రా కదిలి రా' పేరుతో వరుసగా సభలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా అనంతపురం జిల్లా పెనుకొండలో సోమవారం జరిగిన సభలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై, సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జనసేనతో తమ పొత్తు విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read: AP News: 8 మంది ఎమ్మెల్యేలకు భారీ షాక్.. వేటు వేసిన ఏపీ అసెంబ్లీ స్పీకర్
'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ప్రజలంతా అంటున్నారు. మా స్వార్థం కోసం కాకుండా రాష్ట్రాన్ని రక్షించుకునేందుకుకే టీడీపీ-జనసేన కలిశాయి. అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వ్యక్తిని ఇంటికి పంపాలి' అని చంద్రబాబు పిలుపునిచ్చారు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అత్యంత అల్ప వర్షపాతం ఉన్న అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేయాలని సంకల్పించినట్లు తెలిపారు. సాగునీరు ఇస్తే చాలు రాయలసీమ రైతులు బంగారం పండిస్తారని చెప్పారు. గొల్లపల్లి రిజర్వాయర్‌ను 18 నెలల్లో పూర్తి చేసి కియాను తెచ్చామని బాబు వివరించారు. కియా పరిశ్రమతో ఇప్పటివరకు 12 లక్షల కార్లు తయారయ్యాయని, ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని వెల్లడించారు.
Also Read: Kuppam: చంద్రబాబును ఓడించండి.. కుప్పం అభివృద్ధి చేసుకుందాం: సీఎం జగన్ పిలుపు
'మేం అధికారంలో ఉంటే సాగునీరు, పెట్టుబడులు, ఉపాధి పెరిగేవి. నాలెడ్జ్ హబ్, సైన్స్ సిటీ వల్ల ఒక్కరికైనా ఉద్యోగాలు వచ్చాయా?' అని ప్రశ్నించారు. పథకాల్లో కూడా కుంభకోణాలు చేసే వ్యక్తి జగన్ అని ఆరోపించారు. తానెప్పుడూ భావితరాల భవిష్యత్తు కోసమే ఆలోచిస్తా, దేశాన్ని దేశంలోనే నెంబర్ వన్‌గా రాష్ట్రాన్ని చేయాలనేది తన సంకల్పంగా తెలిపారు. రాయలసీమకు తెచ్చిన పెట్టుబడులు ఏమిటో జగన్ చెప్పాలని సవాల్ విసిరారు. రాయలసీమకు ఏ పార్టీ మేలు చేసిందో ప్రజలు గ్రహించాలని సూచించారు.
జగన్ ఐదేళ్ల పాలనలో ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. వాలంటీర్ వ్యవస్థ ఉంటుందని, ఎవరి ఉద్యోగం తీసేయమని ప్రకటించడం గమనార్హం. తమ ప్రభుత్వం వస్తే వలంటీర్లకు మంచి భవిష్యత్తు ఉంటుందని, వారికి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. పాలనా వ్యవస్థలను ధ్వంసం చేయడం జగన్ మార్కు అని పేర్కొన్నారు. అభివృద్ధిలో తమ పార్టీతో పోల్చుకోవద్దని జగన్‌కు సూచించారు. బెంగళూరు-చెన్నై మధ్య పారిశ్రామిక కారిడార్ తీసుకువస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధికి ప్రజలంతా 10 అడుగులు వేస్తే తాము వంద అడుగులు వేస్తామని చంద్రబాబు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Ra Kadili Ra: మా కోసం కాదు.. ఏపీ రాష్ట్ర భవిష్యత్ కోసమే టీడీపీ, జనసేన పొత్తు