Fenugreek Water Health Benefits: మెంతినీటితో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉంటాయి. దీనివల్ల రకరకాల వ్యాధులనుంచి బయటపడవచ్చు. వీటిని ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.
డయాబెటిస్..
డయాబెటిస్తో బాధపడేవారు మెంతులు నానబెట్టిన నీరు తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఉదయం పరగడుపున ఈ నీటిని తీసుకోవాలి. రక్తంలో షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. మెంతులు అందరి ఇళ్లలో కచ్చితంగా ఉండే ఆహారధాన్యం. డయాబెటిస్తో బాధపడేవారు ఒక టీస్పూన్ మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి మరుసటిరోజు ఉదయం ఆ నీటిని తాగాలి.
కొలెస్ట్రాల్..
మెంతులు శరీరంలో పెరిగిన కొలెస్ట్రాల్‌ను తొలగిస్తాయి. అంతేకాదు, కొలెస్ట్రాల్‌కు సంబంధించిన సమస్యలు ఉంటే రోజూ మెంతి నీటిని తాగాలి. దీంతో రక్త ప్రసరణ కూడా మెరుగవుతుంది. గుండె సమస్యలు రావు
గుండె ఆరోగ్యం..
మెంతుల్లో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు గుండె రోగులకు చాలా మేలు చేస్తాయి. గుండె సమస్యలతో బాధపడేవారు మెంతి గింజలను డైట్లో చేర్చుకోవాలి.
ఇదీ చదవండి: Constipation Problem: నెయ్యితో మలబద్దక సమస్య కు చెక్ !
వెయిట్ లాస్..
మెంతుల్లో పీచుపదార్థం ఉంటుంది. దీంతో ఇది ఆకలిని నియంత్రిస్తుంది. ఎక్కువ ఆహారం తినాలని ఉండదు. కాబట్టి, బరువు కూడా సులభంగా తగ్గొచ్చు.
చర్మం..
మెంతినీరు చర్మానికి కూడా మేలు చేస్తుంది. మెంతినీటిని మీ డైట్లో చేర్చుకుంటే ముఖంపై మొటిమల సమస్య ఉండదు. ముఖంపై కూడా గ్లాసీ లుక్ వస్తుంది.
జీర్ణవ్యవస్థ..
నానబెట్టిన మెంతిగింజలను ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల జీర్ణసమస్యలు తొలగిపోతాయి. మెంతుల్లో పీచు ఉంటుంది కాబట్టి ఇది మలబద్ధకం సమస్యను కూడా తగ్గిస్తుంది. రాత్రంతా నీళ్లలో నానబెట్టిన మెంతిగింజల నీటిని తాగాలి. ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు ప్రోత్సహిస్తుంది.
దగ్గు..
మెంతి గింజలు జలుబు ,దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఒక చెంచా మెంతి గింజలను ఒక కప్పు నీటిలో మరిగించి, నీరు సగం వరకు ఉడికినప్పుడు ఫిల్టర్ చేసి తాగాలి. ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది.
ఇదీ చదవండి: Migraine Relief: ఈ చిట్కాలతో మైగ్రేన్ సమస్య దూరం..! మీరు ట్రై చేయండి
ఆరోగ్యకరమై జుట్టు..
మెంతులు జుట్టుకు కూడా చాలా మేలు చేస్తాయి. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. రోజూ ఒక గ్లాసు మెంతి నీరు తాగడం వల్ల వృద్ధాప్యం ఆలస్యం అవుతుంది. జుట్టును లోపలి నుండి బలంగా ఉంచుతుంది. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter