Jaya Prada: సీనియర్ నటి జయప్రద గురించి కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. అప్పట్లోనే తెలుగు, తమిళం, హిందీ, బెంగాలీ సహా ప్యాన్ ఇండియా లెవల్లో పాపులర్ అయిన నటి. అంతేకాదు అప్పట్లో తెలుగు దేశం తరుపున రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసారు. ఆపై ఉత్తర్ ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ తరుపున రాంపూర్ ఎంపీగా బాధ్యతలు నిర్వహించారు. సినిమాల్లో, రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన జయప్రదను ఇప్పటికీ కొన్ని కేసులు వెంటాయడుతున్నాయి. ఇప్పటికే చెన్నైలోని ఆమెకు సంబంధించిన థియేటర్ ఉద్యోగులకు ఈఎస్ఐ చెల్లించని కారణంగా మద్రాస్ హైకోర్టు ఆమెకు 6 నెలలు జైలు శిక్ష విధించింది. తర్వాత జయప్రదకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా జయప్రద 2019 ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన కేసులో తమ ముందు మార్చి 6లోపు హాజరు పరచాలని ఉత్తర ప్రదేశ్‌లోని రామ్ పూర్ కోర్టు పోలీసులను ఆదేశించింది. 2019లో ఈమె భారతీయ జనతా పార్టీ తరుపున ఎంపీగా పోటీ చేసి తన సమీప సమాజ్ వాది పార్టీ ప్రత్యర్ధి అజాంఖాన్ చేతిలో ఓటమి పాలైయ్యారు. అప్పట్లో ఎన్నికల సందర్బంగా ఆమె ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడినట్టు ప్రజా ప్రతినిధుల కోర్టు జయప్రదకు సమన్లు జారీ చేసింది. దీనిపై జయప్రద స్పందించక పోవడంతో కోర్టు ఆగ్రహించి ఆమెకు అరెస్ట్ చేసి తమ ముందు ఉంచాలని రామ్ పూర్ ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి పాపులర్ అయ్యారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఎంపీగా సేవలందించారు. అది అలా ఉంటే ఆమె మిస్సింగ్ అయ్యినట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆమె కోసం యూపీ పోలీసులు గాలిస్తున్నారని తెలుస్తోంది. 2019 ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసులో ఆమె నిందితురాలిగా ఉన్నారు. అయితే విచారణకు హాజరుకావాలని పలుమార్లు కోర్టు ఆదేశించినా జయప్రద లెక్కచేయలేదట.
జయప్రద విషయానికొస్తే.. తెరపై ఆమె కనిపించినపుడు పాత్ర మాత్రమే కనబడుతోంది. ఓ వైపు అడివి రాముడు వంటి కమర్షియల్ చిత్రాల్లో కథానాయికగా నటిస్తూనే.. అంతులేని కథ, 47 రోజులు వంటి సినిమాల్లో లేడీ ఓరియంటెడ్ మూవీస్‌లో నటించి మెప్పించింది. అంతేకాదు సీతా కళ్యాణం, శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం, హిందీ లవకుశ వంటి పౌరాణిక పాత్రల్లో నటించి మెప్పించిన ఘనత జయప్రదకు దక్కుతుంది. అటు సింహాసనం, రాజపుత్ర రహస్యం, పాతాళ భైరవి (హిందీ)వంటి జానపద చిత్రాల్లో తన నటనతో అభిమానుల మందార మాలలు అందుకుంది.
ఇక హిందీలో అమితాబ్, ధర్మేంద్ర, జితేంద్ర వంటి అగ్రహీరోల సరసన నటించి మెప్పించింది. అక్కడ నెంబర్ వన్ కథానాయికగా సత్తా చాటింది. అటు బెంగాలీ చిత్ర సీమలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఎన్టీఆర్ పై అభిమానంతో రాజకీయాల్లో అడుగుపెట్టింది.
Also Read: Dil Raju: పాలిటిక్స్ లోకి రాబోతున్న దిల్ రాజు.. నిజమెంత?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి