Hindu Puja To Continue In Majjit Cellar: ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి జ్ఞాన్‌వాపి మసీదు కేసు విషయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జ్ఞాన్‌వాపి ప్రాంగణంలోని దక్షిణ సెల్లార్‌లో హిందువులు పూజలు చేసేందుకు హిందువులకు అనుమతినిస్తు అలహాబాద్ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. దక్షిణ సెల్లార్‌లో ఉన్న ‘వ్యాస్ జీ కా తెహ్‌ఖానా’ హిందువులు పూజలు చేయోద్దని, అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ అలహబాద్ కోర్టులో పిటిషన్ ను దాఖలు చేసింది.
Read More: Nayanthara: రూ.100 కోట్లు ఇస్తానన్న ఆ హీరోతో నటించను.. నయనతార సంచలన కామెంట్స్..
దీన్ని విచారించిన సింగిల్ బెంచ్ ధర్మాసనం.. జ్ఞానవాపి కాంప్లెక్స్‌లోని 'వ్యాస్ తెహ్ఖానా'లో పూజలు చేసేందుకు హిందూ పార్టీలకు కోర్టు అనుమతినిచ్చింది. ఈ మేరకు జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్‌తో కూడిన సింగిల్ బెంచ్ విచారించింది.
ఈ పరిణామంపై హిందూ తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ స్పందిస్తూ.. “అంజుమన్ ఇంతేజామియా ఆదేశాల నుండి వచ్చిన మొదటి అప్పీల్‌ను అలహాబాద్ హైకోర్టు ఈరోజు తోసిపుచ్చిందన్నారు. ఇందులో వారణాసి జిల్లా కోర్టు జనవరి 17, 31వ తేదీల్లో జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేశారు. అలహాబాద్ హైకోర్టు విషయం యొక్క ముఖ్యాంశం ఏమిటంటే, జ్ఞానవాపి కాంప్లెక్స్‌లోని 'వ్యాస్ తెహ్ఖానా'లో కొనసాగుతున్న పూజలను హిందువులు కొనసాగించవచ్చు.
అంజుమన్ ఇంతేజామియా సుప్రీంకోర్టుకు వస్తే, ఎస్సీ ముందు మా కేవియట్ దాఖలు చేస్తామని న్యాయవాది విష్ణు శంకర్ జైన్ తెలిపారు. న్యాయవాది ప్రభాష్ పాండే మాట్లాడుతూ... “జిల్లా జడ్జి ఆదేశాలకు వ్యతిరేకంగా ముస్లిం పక్షం దాఖలు చేసిన పిటిషన్‌లను న్యాయమూర్తి కొట్టివేశారు. అంటే పూజ యథావిధిగా కొనసాగుతుంది. జిల్లా మేజిస్ట్రేట్ 'తెహ్ఖానా' రిసీవర్‌గా కొనసాగుతారు. ఇది మన సనాతన ధర్మానికి పెద్ద విజయం... వారు (ముస్లిం పక్షం) నిర్ణయాన్ని సమీక్షించవచ్చన్నారు. నేటినుంచి పూజలు యథా ప్రకారం జరుగుతాయన్నారు.
న్యాయవాది సుభాష్ నందన్ చతుర్వేది మాట్లాడుతూ.. “... ఈరోజు, హైకోర్టు కూడా అక్కడ పూజలు, మతపరమైన ఆచారాలు జరిగేవని అంగీకరించింది. 1993లో, ఎటువంటి పత్రం లేదా ఉత్తర్వు లేకుండా మతపరమైన ఆచారాలను నిలిపివేసింది. కాబట్టి, ఈ రోజు జిల్లా కోర్టు తీర్పును సమర్థించారు. హైకోర్టు మాకు అనుకూలంగా తీర్పునిచ్చిందన్నారు. అంజుమన్ ఇంతేజామియా (మసీదు కమిటీ) అభ్యంతరాన్ని హైకోర్టు తోసిపుచ్చిందని తెలిపారు.
వారణాసి జిల్లా జడ్జి రెండు ఉత్తర్వుల చెల్లుబాటును సవాలు చేస్తూ మసీదు కమిటీ దాఖలు చేసిన అప్పీళ్లను కోర్టు విచారించింది. సెక్షన్ 151, 152 ప్రకారం న్యాయ ప్రయోజనాల దృష్ట్యా ఉత్తర్వులు జారీ చేసే అధికారం కోర్టుకు ఉందని ఆలయ పక్షం వాదించింది. జిల్లా జడ్జి దరఖాస్తును మూడుసార్లు విచారించారని, మసీదు తరఫు నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు.
జిల్లా జడ్జి కొత్తగా ఎలాంటి హక్కులు కల్పించలేదని, చట్టపరమైన ప్రక్రియకు అనుగుణంగానే ఉత్తర్వులు జారీ చేశామని కోర్టు పేర్కొంది. దిన్ మహ్మద్ కేసు వ్యాస్ నేలమాళిగను ప్రస్తావించిందని, జితేంద్ర వ్యాస్ పూజించే హక్కు అంగీకరించబడిందని కోర్టు పేర్కొంది.
హిందువులు పూజల హక్కు కోసం దాఖలైన సివిల్ దావాలో హక్కును నిర్ణయించకుండా పూజలకు అనుమతి ఇవ్వడం చట్టపరమైన ప్రక్రియను ఉల్లంఘించడమేనని మసీదు పక్షం వాదించింది. అలాగే జిల్లా జడ్జి రెండు పరస్పర విరుద్ధమైన ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం హిందువులకు పూజలకు అనుమతి ఇవ్వడంతో ఆప్రాంతంలో హిందువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook