The Kerala Stroy OTT News: 'ది కేరళ స్టోరీ'.. ఆ రాష్ట్రంలో నిజంగా జరిగిన సంఘలన నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. అంతేకాదు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. రూ. 15 కోట్ల స్మాల్ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ దాదాపు రూ. 300 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఎపుడో విడుదలైన ఈ సినిమా చాలా నెలల తర్వాత ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5 లోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అక్కడ ఈ సినిమా నెంబర్ వన్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఈ సినిమా ఇప్పటికే 150 మిలియన్ మినిట్స్‌తో టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
కేరళ రాష్ట్రంలో జరిగిన లవ్ జిహాద్ కారణంగా బలైన హిందూ, క్రిష్టియన్ అమ్మాయిలు ఎలా ముస్లిమ్స్ అబ్బాయిలో లవ్ ట్రాప్‌లో ఎలా పడతారు. ఈ సందర్బంగా వాళ్లు ఎలా బ్రెయిన్ వాష్ చేయబడతారనే విషయాన్ని ఈ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారు దర్శకుడు సుదీప్తో సేన్. ముఖ్యంగా ఇంటి నుంచి పారిపోయిన అమ్మాయిలు.. మతం మార్చి ముస్లిమ్ అమ్మాయిలుగా మార్చడం.. ఆ తర్వాత ఐసిస్ క్యాంపులో ఆ అమ్మాయిలు చేర్పించడం. అక్కడ ఈ అమ్మాయిలు సెక్సు బానిసలుగా ఎలా మార్చబడ్డారనే విషయాన్ని ఈ సినిమాలో చూపించారు. కేరళ అమ్మాయిల నిజ జీవిత గాథ ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు సుదీప్తో సేన్ ఎంతో రీసెర్చి చేసి తెరకెక్కించారు. ఈ సినిమాను విపుల్ అమృత్ లాల్ షా నిర్మించారు.
'ది కేరళ స్టోరీ' మూవీ మన దేశంలో ఓ వర్గం వారికి కించపరిచేలా ఉందని అప్పట్లో కేరళ, తమిళనాడు, పశ్చిమ బంగాల్ వంటి ప్రభుత్వాలు ఈ సినిమాను అక్కడ వవిడుదల కాకుండా అడ్డుకున్నాయి. తీరా అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) కలగ చేసుకోవడంతో ఆయా రాష్ట్రాల్లో ఈ సినిమాలు విడుదలకు ఉన్న అడ్డంకులు తొలిగిపోయాయి. 'ది కేరళ స్టోరీ' సినిమాను లవ్ జిహాద్ పేరిట 32 వేలకు పైగా అమాయకులైన హిందూ, క్రిష్టియన్ అమ్మాయిలను ఇస్లామ్ మతంలోకి మార్చి వారిని ఐసిస్ క్యాంపుల్లో పంపించి వారిని దేశ వ్యతిరేకులుగా ఎలా మారుస్తున్నారనే విషయాన్ని కేరళ స్టోరీ మూవీలో చూపించారు.
కులాలకు మతాలకు అతీతంగా ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పేమి కాదు. మన దగ్గర ఎంతో మంది మతాంతర వివాహాలు చేసుకున్న వారు ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నారు. కానీ లవ్ జిహాద్ పేరిట ప్రేమించిన అమ్మాయిలను ఐసీస్ క్యాంపుల్లో చేర్పించి వారిని అక్కడ సెక్స్ బానిసలుగా మార్చడం.. వారు అప్పటి వరకు ఆరాధించిన మతాన్ని ద్వేషించేలా చేయడాన్నే చాలా మంది తప్పు పడుతున్నారు.
ఈ సినిమా ఆర్ఆర్ఆర్, దంగల్ మూవీల తర్వాత ఎక్కువ దేశాల్లో రిలీజైన మూవీగా 'ది కేరళ స్టోరీ' మూవీగా రికార్డులకు ఎక్కింది. ఈ చిత్రంలో అదా శర్మ.. శాలిని ఉన్నికృష్ణన్ నుంచి ఫాతిమాగా ఎలా మారిందనే విషయాన్ని చూపించారు దర్శకుడు. ఈ సినిమాలోని నటనకు అదా శర్మకు జాతీయ ఉత్తమనటి అవార్డు పక్కా అని చెబుతున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 330 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. మొత్తంగా గతేడాది సంచలనం రేపిన ఈ సినిమా ఓటీటీలో అపుడే నంబర్ వన్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook