Biryani Akulu For Reduce Bad Cholesterol: బే ఆకులను తెలుగు రాష్ట్ర ప్రజలు బిర్యానీ ఆకులుగా పిలుస్తారు. ఈ ఆకులను ప్రతి మసాలా తయారిలో వినియోగిస్తారు. ఈ బే ఆకులతో తయారు చేసిన మసాలాను క్రమం తప్పకుండా ఆహారాల్లో వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు బాడీలోని కొలెస్ట్రాల్‌ను కరిగించి జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా ఈ ఆకులను అనేక రకాల అనారోగ్య సమస్యలకు ఔషధంగా కూడా వినియోగిస్తారు. అయితే దీని వల్ల శరీరానికి కలిగే లాభాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఎండిన బే ఆకులను కూరలు, సూప్‌ల్లో వినియోగించడం వల్ల రక్తస్రావాన్ని మెరుగు పరుచుతాయి. అంతేకాకుండా ఈ ఆకులలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో పాటు ఫైబర్ కూడా లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు ఆహారాల్లో వినియోగించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే శ్వాసకోశ రుగ్మతలు, అంటువ్యాధులు, జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు ప్రభావంతంగా సహాయపడుతుంది. దీంతో పాటు మూత్రవిసర్జన వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది.
బే ఆకుతో తయారు చేసిన మసాలా పొడులను ఆహారాల్లో వినియోగించడం వల్ల కడుపు నొప్పి, ఊపిరితిత్తులలో పేరుకుపోయిన కఫం నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా శీతాకాలంలో వచ్చే జలుబు, గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఆర్థరైటిస, నరాల నొప్పి ఉన్నవారికి ఈ ఆకులు గొప్ప ఉపశమనాన్ని కలిగిస్తాయి.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
ఈ బిర్యానీల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డయేరియా గుణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. దీంతో పాటు ఇందులో యాంటీ డయాబెటిక్ లక్షణాలు కూడా ఉంటాయి. కాబట్టి వీటిని ఆహారాల్లో వినియోగించడం వల్ల రోగనిరోధక శక్తిని బలోపేతమవుతుంది. అంతేకాకుండా రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు రక్తంలో చక్కెర, యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
ముఖ్యంగా ఈ ఆకులను క్రమం తప్పకుండా ఆహారాల్లో వినియోగించడం వల్ల శరీరంలోని చెడు కొవ్వు తగ్గి..గుండె జబ్బుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు ఈ ఆకుల్లో ఉండే రసాయన సమ్మేళనాలు కడుపు నొప్పి, ప్రేగు సిండ్రోమ్ నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter