IAF Saves Ayodhya Devotee: లక్షల సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో అయోధ్యపురి భక్తనగరిగా మారింది. వివిధ రంగాల ప్రముఖులతో పాటు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో అయోధ్య వీధులు కిటకిటలాడాయి. అయోధ్యలో పూజా కార్యక్రమాలు నేత్రపర్వంగా సాగుతున్న సమయంలో ఓ భక్తుడు గుండెపోటుకు గురయ్యాడు. ప్రాణప్రతిష్ట వేడుకలో ఇది కలకలం రేపింది. వెంటనే స్పందించిన అక్కడి భద్రతా దళాలు, పోలీసులు అతడిని వెంటనే బయటకు తీసుకొచ్చారు. ఆలయ ఆవరణలో కుప్పకూలిన అతడిని రక్షించాయి. ప్రాథమిక చికిత్స అనంతరం వైమానిక దళం వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి సత్వరమే వైద్యం అందించేలా కృషి చేశాయి.
రామకృష్ణ శ్రీవాత్సవ (65) అనే భక్తుడు అయోధ్య ప్రాణ ప్రతిష్ట కోసం వచ్చాడు. పూజా కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో భక్తిపారవశ్యంలో ఉన్నారు. అయితే పెద్ద సంఖ్యలో భక్తులు ఉండడంతో రద్దీ వలన ఆయన ఉక్కిరిబిక్కిరికి గురయ్యాడు. ఈ సమయంలో అతడు ఒత్తిడికి తాళలేక గుండెపోటుకు గురయ్యాడు. ఆలయ ఆవరణలోనే కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడ కలకలం ఏర్పడింది. వెంటనే స్పందించి అక్కడి అధికార యంత్రాంగం శ్రీవాత్సవకు సపర్యలు చేశారు. ప్రాథమిక వైద్యం అనంతరం అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించాలని అక్కడి వైద్య బృందం తెలిపింది.
అధికారులు సమన్వయం చేసుకుని వెంటనే భారత వైమానిక దళాన్ని అప్రమత్తం చేశారు. వింగ్ కమాండర్ మనీష్ గుప్తా వెంటనే హెలికాప్టర్లో శ్రీవాత్సవను ఎక్కించుకుని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వెంటనే ఆస్పత్రి వైద్యులు అతడికి వైద్యం అందించడంతో శ్రీవాత్సవ పరిస్థితి మెరుగైంది. అస్వస్థతకు గురైన సమయంలో ఆయన గుండె వేగం తీవ్రంగా ఉంది. గుండె వేగం 210/170 స్థాయిలో ఉందని, సమయానికి ఆస్పత్రికి చేరడంతో అతడి ప్రాణాలు కాపాడినట్లు వైద్యులు తెలిపారు. అయోధ్య రామందిర ప్రాణ ప్రతిష్ట సమయంలో ప్రత్యేక వైద్య ఏర్పాట్లు చేశారు. అస్వస్థతకు గురైన వారికి అత్యవసర సేవలు అందించేందుకు వైద్య బృందాలు అందుబాటులో ఉన్నాయి. ఆలయ పరిసరాల్లో ప్రత్యేకంగా అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచారు. అవసరమైన వారికి మందులు, వైద్య సేవలు అందించారు.
అయోధ్య ప్రాణ ప్రతిష్ట కనులవిందుగా జరిగింది. సినీ, రాజకీయ, ఆర్థిక, వ్యాపార, క్రీడా, పారిశ్రామిక రంగాల ప్రముఖులు ఈ వేడుకలో భాగమయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ అన్నీ తానై వ్యవహరించారు. అయోధ్య రామందరం ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేశమంతా పండుగ వాతావరణం సంతరించుకుంది. రాముడి దివ్యరూపం చూసి హిందూ భక్తజనం పులకించిపోయింది. ఈ దివ్యమైన వేడుక సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చాలా చోట్ల భక్తులు శోభాయాత్ర నిర్వహించి రామనామస్మరణ చేశారు.
Also Read: Bike Buys with Coins: పూజారి "చిల్లర ప్రేమ" కథ వినండి.. వీరి ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook