Rahul Gandhi Nyay Jodo Yatra: దేశవ్యాప్తంగా అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ట సంబరాలు జరుగుతుండగా అస్సాంలో మాత్రం తీవ్ర రాజకీయ వివాదం నెలకొంది. అయోధ్య ఆలయం ప్రారంభోత్సవం వేళ ఓ ఆలయానికి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ వెళ్లగా అక్కడి నిర్వాహకులు అడ్డుకున్నారు. ఆలయంలోకి వెళ్లనివ్వకపోవడం తీవ్ర వివాదానికి దారితీసింది. దీనికితోడు అడుగడుగునా యాత్రకు ఆటంకం కలిగించడంతో అస్సాంలో ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది.
Ayodhya Pran Pratishtha, Devotee Suffer Heart Attack: కోట్లాది మంది భక్తుల ఎదురుచూపులు ఫలించాయి. శతాబ్దాల కాలం నాటి కల తీరింది. అయోధ్యలో రామయ్య కొలువుదీరిన వేళ హిందూ భక్తలోకం పులకించింది. అట్టహాసంగా.. దేదీప్యమానంగా జరిగిన అయోధ్య ప్రాణప్రతిష్ట వేడుకలో ఓ భక్తుడు గుండెపోటుకు గురయ్యాడు. భక్తులతో ఆలయం కిటకిటలాడడంతో ఆయన అస్వస్థతకు గురయ్యాడు. ఆలయ ప్రాంగణంలో కుప్పకూలిన అతడిని భారత వైమానిక దళం రక్షించింది.
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ట రాజకీయ వివాదానికి దారి తీసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే వర్సెస్ ఇండియా కూటమిగా మారింది. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి అధికార ఎన్డీయే కూటమి హాజరవుతుండగా.. ప్రతిపక్ష ఇండియా కూటమి బహిష్కరించింది. ఫలితంగా ఆయా కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సంబరాలు జరుగుతుండగా.. ప్రతిపక్ష కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఈ ఉత్సవానికి అంటిముట్టనట్టుగా ఉన్నాయి. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.