Shukra Gochar 2024: 10 ఏళ్ల తర్వాత అరుదైన రాజయోగం.. రేపటి నుండి ఈ 3 రాశులపై డబ్బు వర్షం...

Grah Gochar 2024: ఈరోజు శుక్రుడు ధనస్సు రాశి ప్రవేశం చేశాడు. ఇదే సమయంలో కుజుడు మరియు బుధుడుతో కలిసి శుక్రుడు అరుదైన రాజయోగాలను ఏర్పరుస్తున్నాడు. దీంతో మూడు రాజయోగాలు ఏర్పడుతున్నాయి.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 18, 2024, 07:34 PM IST
Shukra Gochar 2024: 10 ఏళ్ల తర్వాత అరుదైన రాజయోగం.. రేపటి నుండి ఈ 3 రాశులపై డబ్బు వర్షం...

Benefits of Trigrah and Mahalaxmi Rajyog: అష్టగ్రహాల్లో శుక్రుడు కూడా ఒకరు. పురాణాల ప్రకారం, ఇతడు రాక్షసులు గురువు. జ్యోతిష్యశాస్త్రంలో శుక్రుడిని శుభగ్రహంగా భావిస్తారు. ఇతడిని ప్రేమ, రొమాన్స్ మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడిగా భావిస్తారు. ఇవాళ(జనవరి 18) శుక్రుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించాడు. ఇప్పటికే అదే రాశిలో కుజుడు మరియు బుధుడు సంచరిస్తున్నారు. ఈ మూడు గ్రహాల కలయిక వల్ల అరుదైన త్రిగ్రహ యోగం ఏర్పడింది. దీంతోపాటు లక్ష్మీ నారాయణ యోగం మరియు మహాలక్ష్మీ యోగంతో సహా అనేక శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ యోగాలు కారణంగా మూడు రాశులవారు లాభపడనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 

ధనుస్సు: ఇదే రాశిలో ఈ రాజయోగాలన్నీ ఏర్పడుతున్నాయి. దీంతో ఈరాశి వారికి పదవి, డబ్బు, గౌరవం లభిస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ వ్యక్తిత్వంతో నలుగురిని ఆకట్టుకుంటారు. మీ సంపదలో పెరుగుదల ఉంటుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ దారిద్ర్యం తొలగిపోతుంది.
మేషం: గ్రహాల చేస్తున్న రాజయోగం మేషరాశివారికి శుభప్రదంగా ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. అదృష్టం మీ వెంటే ఉంటుంది. వ్యాపారస్తులు లాభపడతారు. మీరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కు ఏదైనా టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషం వెల్లివిరిస్తుంది. 
వృశ్చికం: శుక్రుడి సంచారం వృశ్చిక రాశి వారికి మేలు చేస్తుంది. మీరు ఆర్థికంగా లాభపడతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగం సాధించాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. మీరు కెరీర్ లో అద్భుతమైన పురోగతి సాధిస్తారు. మీకు లైఫ్ పార్టనర్ సపోర్టు లభిస్తుంది. మీ సుఖ ప్రాప్తి కలుగుతుంది. మీకు సంతానం కలిగే అవకాశం ఉంది. 

Also Read: Ayodhya Pran Pratishtha Time: గర్భగుడికి చేరుకున్న బాలరాముడు, మరో మూడ్రోజులు ఏం జరగనుంది

Also Read:First Pournami 2024: 2024లో మొదటి పౌర్ణిమ ప్రాముఖ్యత, తిథి సమయం, పూజ విధి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News