Nepal Accident Today: నేపాల్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. డాంగ్ జిల్లాలో రాప్తి నదిలో బస్సు పడిపోవడంతో ఇద్దరు భారతీయులు సహా 12 మంది మరణించారు. మరో 23 మంది గాయపడ్డారు. భాలుబాంగ్ వద్ద శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. బస్సు నేపాల్‌గంజ్ నుంచి ఖాట్మండుకు వెళుతుండగా భలుబాంగ్‌లోని రాప్తీ వంతెనపై నుంచి ఈస్ట్-వెస్ట్ హైవేపై నదిలోకి దూసుకెళ్లిందని వెల్లడించారు.
“ప్యాసింజర్ బస్సు బాంకే నేపాల్‌గంజ్ నుంచి ఖాట్మండుకు వెళుతుండగా.. వంతెనపై నుంచి రాప్తీ నదిలో పడిపోయింది. మరణించిన వారిలో ఎనిమిది మంది ప్రయాణికులను గుర్తించాం. అందులో ఇద్దరు భారతీయులు ఉన్నారు” అని భలుబాంగ్‌లోని ఏరియా పోలీస్ స్టేషన్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉజ్వల్ బహదూర్ సింగ్ తెలిపారు. ఈ ప్రమాదంలో 23 మంది గాయపడ్డారని ఆయన చెప్పారు.
ఇద్దరు భారతీయులు బీహార్‌కు చెందిన మలాహికి చెందిన యోగేంద్ర రామ్ (67), ఉత్తరప్రదేశ్‌కు చెందిన మునే (31)గా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం లామాహి ఆసుపత్రికి తరలించారమని ఆయన వెల్లడించారు. క్షతగాత్రులను నేపాల్‌గంజ్‌లోని ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదన్నారు. బస్సు డ్రైవర్ లాల్ బహదూర్ నేపాలీ (28)ని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: January Bank Holidays List: బిగ్ అలర్ట్.. బ్యాంకులకు వరుసగా ఐదు రోజులు సెలవులు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook