VV Vinayak: వైనాట్ 175 లక్ష్యంగా బరిలో దిగుతున్న వైఎస్ జగన్ అందుకు తగ్గట్టే పార్టీలో గెలుపు గుర్రాల్ని ఎంచుతున్నారు. ప్రతి నియోజకవర్గాన్ని ఆచి తూచి అన్ని సమీకరణాలతో వడపోస్తూ ఇన్ఛార్జ్ ఎంపిక చేస్తున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలపై ఫోకస్ పెట్టడంతో ప్రముఖులు పార్టీలో చేరేందుకు సిద్ధమౌతున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త వ్యూహాలతో బరిలో దిగుతున్నారు. తెలుగుదేశం-జనసేన పొత్తు నేపధ్యంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇప్పటికే కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పార్టీలో చేరిక దాదాపుగా ఖరారైంది. మరోవైపు వంగవీటి రాధాతో మంతనాలు జరుగుతున్నాయి. ఇక ప్రముఖ దర్శకుడు చాగల్లు వాస్తవ్యుడైన వీవీ వినాయక్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇవాళ లేదా రేపు పార్టీలో చేరనున్నారు. జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవీతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీలకు వివి వినాయక్ అత్యంత సన్నిహితుడు కావడం విశేషం.
రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం లేదా కాకినాడ నుంచి పోటీ చేస్తున్న క్రమంలో సరైన అభ్యర్ధిని సిద్ధం చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. కాకినాడ లేదా ఏలూరు లోక్‌సభ బరి నుంచి వివి వినాయక్‌ను బరిలో దించే ఆలోచన చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. వాస్తవానికి 2014 ఎన్నికల సమయంలోనే వివి వినాయక్ నిడదవోలు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది.
ఈసారి ఏలూరు నుంచి లోక్‌సభకు పోటీ చేయనని కోటగిరి శ్రీధర్ వైసీపీ అధిష్టానానికి స్పష్టం చేశారు. అటు కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురంకు పంపించారు. ఈ నేపధ్యంలో కాకినాడ, ఏలూరు స్థానాల్నించి బలమైన కాపు అభ్యర్ధి అవసరం ఉంది. అందుకే వివి వినాయక్ పేరు విన్పిస్తోంది.
Also read: Ind vs Afg: ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు సిద్ధమైన ఇండియా, ఆఫ్ఘన్ జట్టు ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook