AP Elections 2024: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. త్వరలో నోటిఫికేషన్ వెలువరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ మొదటి వారం నుంచే దేశంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావచ్చని అంచనా. అదే జరిగితే ఏపీ ఎన్నికలు ముందే జరిగిపోవచ్చని అంచనా.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం బృందాలు వచ్చేవారం ఏపీలో పర్యటించనున్నాయి. ఈసారి దేశంలో లోక్‌సభతో పాటు ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 7 నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల సన్నాహాలు ప్రారంభిస్తుంది. మొత్తం అన్ని రాష్ట్రాల్లో పర్యటనలు ముగిసిన తరువాత ఆ సమాచారాన్ని బట్టి నోటిఫికేషన్ విడుదల చేయవచ్చు గతంతో పోలిస్తే ఈసారి నెల రోజులు ముందే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఇప్పటికే పదవ తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేశాయి. మార్చ్ నెలాఖరుకు రెండు కీలకమైన పబ్లిక్ పరీక్షలు పూర్తి చేసేలా షెడ్యూల్ రూపొందించారు.
గతంలో అంటే 2019లో దేశవ్యాప్తంగా 7 విడతల్లో జరిగిన ఎన్నికలు ఏప్రిల్ 11న ప్రారంభమై..మే 19న ముగిశాయి. ఈసారి కొద్దిగా ముందు అంటే ఏప్రిల్ మొదటి వారం లేదా మార్చ్ చివరి వారంలో ఎన్నికలు ప్రారంభం కావచ్చని అంచనా ఉంది. ఈసారి కూడా గతంలో నిర్వహించినట్టే తొలి దశలోనే ఏపీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి కన్పిస్తోంది. ఏపీలోని 25 లోక్‌సభ స్థానాలతో పాటు తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాలకు ఒకేసారి తొలి విడతలో ఎన్నికలు నిర్వహించవచ్చు.
ఏపీలో ఎన్నికల నిర్వహణలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 9,10 తేదీల్లో ఏపీకు రానుంది. ఓటర్ల జాబితాలో లోపాలు, అధికారులు సిద్ధం చేస్తున్న జాబితా, ఓటర్ల జాబితాపై వచ్చిన ఫిర్యాదులు, పోలింగ్ కేంద్రాలు, సమస్యాత్మక ప్రాంతాలు వంటివాటిని క్షేత్రస్థాయిలో తెలుసుకోనుంది. అందుకే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కూడా కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ కానున్నారు.
Also read: జగన్ ఇంటికి వెళ్లేముందు షర్మిల ఏమన్నారంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook