/telugu/photo-gallery/after-world-cup-clinches-india-team-how-celebrated-looks-here-and-virat-kohli-rohith-sharma-also-rv-146014 World Cup India: ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టు సంబరాలు.. కోహ్లీ ఏం చేశారో చూశారా World Cup India: ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టు సంబరాలు.. కోహ్లీ ఏం చేశారో చూశారా 146014

Top 3 Electric SUV Cars: ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ పెరిగేకొద్దీ వివిధ రకాల కంపెనీలు ప్రతియేటా ఈవీ కార్లు మార్కెట్‌లో ప్రవేశపెడుతున్నాయి. ఇందులో భాగంగా వచ్చే ఏడాది అంటే 2024లో 3 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఆ వాహనాల వివరాలు ఇలా ఉన్నాయి.

ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతుండటంతో కార్ల ఉత్పత్తి కంపెనీలు ఈవీ కార్లపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అందుకే భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో పురోగతి కన్పిస్తోంది. వచ్చే ఏడాది 2024లో కొత్త ఎలక్ట్రిక్ కార్లు లాంచ్ కానున్నాయి. వీటిలో మూడు కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Mahindra XUV.e8

మహీంద్రా కంపెనీ తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ డిసెంబర్ 2024లో లాంచ్ కానుందని కంపెనీ వెల్లడించింది. ఎక్స్‌యూవీ ఇ8  కాన్సెప్ట్ ఆధారంగా ఉంది. ఇది న్యూ బోర్న్ ఎలక్ట్రిక్ ఇంగ్లో స్కేట్ బోర్డ్ ఆర్కిటెక్చర్ ఆధారంగా ఉంది. పవర్ ట్రెయిన్, వీల్ బేస్, ట్రాక్ డైమెన్షన్, ఏడబ్ల్యూడీ, ఆర్‌డబ్ల్యూడీ లేఅవుట్ సపోర్ట్ చేస్తోంది. ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ట్రూ సేల్ ఆర్కిటెక్చర్ కొత్త బ్యాటరీ ప్యాకప్‌తో వస్తోంది. దీని పవర్ ట్రెయిన్ 230 బీహెచ్‌పి నుంచి 350 బీహెచ్‌పి రేంజ్‌లో పవర్ అవుట్ పుట్ ఇస్తుంది. 

Tata Punch EV

టాటా మోటార్స్ వచ్చే ఏడాది 2024లో దేశంలో 3 కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్లు లాంచ్ చేస్తోంది. ఇందులో అన్నింటికంటే ముందుగా టాటా పంచ్ ఈవీ వస్తోంది. టాటా పంచ్ ఈవీను 2024 తొలి త్రైమాసికంలో ప్రవేశపెట్టవచ్చు. కొత్త మోడల్ జెన్ 2 ప్లాట్‌ఫామ్‌పై ఆధారితమౌతుంది. మూలరూపంలో ఆల్ఫా మాడ్యూల్ ప్లాట్‌ఫామ్‌పై రివైజ్జ్ వెర్షన్ ఇది.

MARUTI SUZUKI eVX

మారుతి సుజుకి 2024 చివర్లో దేశంలో ఇవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఉత్పత్తి వెర్షన్ లాంచ్ చేస్తోంది. ఈ ఎస్‌యూవీ అనేది గుజరాత్‌లోని ప్లాంట్‌లో తయారౌతుంది. ఇండియాతోపాటు యూరప్ సహా చాలా దేశాల్లో మార్కెట్‌లో రానుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆల్ న్యూ స్కేట్ బోర్డ్ ప్లాట్‌ఫామ్ ఆధారితమైంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై దాదాపు 500 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇందులో 60 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్ లభించవచ్చు. మహీంద్రా ఎక్స్‌యూవీ 400, ఎంజీ జెడ్‌ఈవీ, హ్యుండయ్ క్రెటా ఈవీలతో ఉండవచ్చు.

Also read: PPF Investment: నెలకు 3 వేలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ తరువాత 16 లక్షలు, ఎలాగంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Top Electric SUV Cars going to launch in 2024 know here the top 3 brands Mahindra, Tata and Maruti suzuki rh
News Source: 
Home Title: 

Top 3 Electric SUV Cars: త్వరలో లాంచ్ కానున్న టాప్ 3 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్లు ఇవే

Top 3 Electric SUV Cars: ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్లాన్ చేస్తున్నారా, త్వరలో లాంచ్ కానున్న టాప్ 3 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఇవే
Caption: 
Top EV SUV Cars ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Top 3 Electric SUV Cars: త్వరలో లాంచ్ కానున్న టాప్ 3 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్లు ఇవే
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Tuesday, December 26, 2023 - 15:47
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
27
Is Breaking News: 
No
Word Count: 
289