Telugu Directors:సినీ ఇండస్ట్రీలో సినిమాని ముందు ఉండి నడిపించేది హీరో అయితే.. తెర వెనుక కథ మొత్తం నడిపించేది డైరెక్టర్. మరి టాలీవుడ్ లో కొందరి డైరెక్టర్స్ కి ప్రత్యేకమైన కొన్ని అలవాట్లు ఉన్నాయి. వాళ్లు తీసే సినిమాల్లో కొన్ని కామన్ పాయింట్స్ మనం ఈజీగా రిపీట్ అవ్వడం గమనించవచ్చు. మరి అవేమిటో ఓ లుక్కేద్దాం పదండి..
రాఘవేంద్రరావు:
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకప్పటి అగ్రతారాల దగ్గర నుంచి నేటి సూపర్ స్టార్స్ వరకు అందరితో రాఘవేంద్రరావు చిత్రాలు నిర్మించారు. రాఘవేంద్రరావు సినిమాలో హీరోయిన్ కి ప్రత్యేకమైన సాంగ్ సెట్టింగ్ ఉండడం పరిపాటే. పువ్వుల దగ్గర నుంచి పండ్ల వరకు.. ప్రతి ఒక్కదాన్ని రొమాంటిక్ యాంగిల్ తో చూపించడమే కాకుండా.. ప్రకృతిని రమణీయంగా తన పాటల లో కొత్త తరహాలో పరిచయం చేయడంలో రాఘవేంద్రరావు తర్వాతే మరెవరైనా. భక్తి రస చిత్రాలకు కూడా రాఘవేంద్రరావు ప్రసిద్ధి పొందిన డైరెక్టర్.
రాజమౌళి:
ఇక టాలీవుడ్ సత్తా మన దేశాన్ని దాటి విదేశాల వేదిక వరకు తీసుకువెళ్లిన దర్శక ధీరుడు రాజమౌళి. స్ట్రాంగ్ స్టోరీ కంటెంట్ తో.. ఎవరు ఊహించలేని విభిన్నమైన కథనంతో.. ఓకే సినిమాలో యాక్షన్ ,రొమాన్స్ ,కామెడీ, సెంటిమెంట్.. పలికించగలిగే డైరెక్టర్ రాజమౌళి. రాజమౌళి మూవీలో హీరోకి కచ్చితంగా ఓ అతి పెద్ద ఫ్లాష్ బ్యాక్ కామన్ గా ఉంటుంది. అలాగే హీరోయిన్ కూడా హీరో ప్రేమలో చాలా ఈజీగా పడిపోతుంది. విలన్ కి హీరో కి ఫ్లాష్ ప్యాక్ లో కనెక్షన్ స్ట్రాంగ్ గా ఉంటుంది.
గుణశేఖర్:
వెరైటీ కంటెంట్తో మంచి చిత్రాలను తీసే ఎందరో డైరెక్టర్స్ మనకు తెలుసు..అలాంటి ఒక విభిన్నమైన డైరెక్టర్ గుణశేఖర్.. భారీ సెట్స్ తో పాటు అదరగొట్టే ఆర్ట్ వర్క్ కనిపించింది అంటే దాని వెనక గుణశేఖర్ హ్యాండ్ ఉంది అని అర్థమవుతుంది. గుణశేఖర్ తయారు చేసే మూవీ అంటే.. హీరో ఓ రేంజ్ లో ఉంటాడు ..వరుడు, సైనికుడు ,ఒక్కడు, మృగరాజు.. ఇలా అతను సృష్టించిన విజువల్ వండర్స్ ఈ మూవీస్ లో చూడవచ్చు.
మహేష్ బాబు కెరీర్ ని మలుపు తిప్పిన ఒక్కడు చిత్రంలో చార్మినార్ చుట్టూ చాలా సన్నివేశాలు నడుస్తాయి. అయితే ఇది మొత్తం ఒక భారీ సెట్టింగ్ అన్న విషయం మీకు తెలుసా. సడన్ గా చూస్తే ఒరిజినల్ చార్మినార్ దగ్గరే షూటింగ్ చేశారు అన్న భావన కలుగక మానదు. అది గుణశేఖర్ మూవీలో ఉన్న స్పెషాలిటీ. ఇక వరుడు మూవీలో పెళ్లి కొడుకు పెళ్లి మండపం సెట్టింగ్ భారీ హంగులతో అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈయన దర్శకత్వంలో వచ్చిన రుద్రమదేవి చిత్రంలో ఎటువంటి భారీ సెట్టింగ్స్ ఉన్నాయో అందరికీ తెలుసు.
వివి వినాయక్:
ఇక మాస్ చిత్రాలకు కమర్షియల్ టచ్ ఇచ్చి ఆడియన్స్ విజిల్స్ వేసేలా చేసే డైరెక్టర్ వివి వినాయక్. సీరియస్ చిత్రాలకే కాదు కామెడీ మూవీస్ కి కూడా ఈయన పెట్టింది పేరు. జూనియర్ ఎన్టీఆర్ తో వినాయక్ తెరకెక్కించిన ఆది.. బాలయ్య చెన్నకేశవరెడ్డి.. మెగాస్టార్ ఠాగూర్ వంటి చిత్రాలు మాస్ ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా ఎంతో బాగా నచ్చాయి. వీటితోపాటుగా ఆయన డైరెక్షన్లో వచ్చిన బన్నీ, లక్ష్మి ,అదుర్స్ ,ఖైదీ నెంబర్ 150 చిత్రాలు మాస్ కంటెంట్ తో పాటు మంచి కామెడీ యాంగిల్ తో కూడా ప్రేక్షకులను అలరించాయి.
రామ్ గోపాల్ వర్మ:
క్లాస్.. మాస్ అన్ని పక్కన పెడితే కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా ఉండే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. మాఫియా నేపథ్యంతో సాగే చిత్రాలను ఎంతగా ఇష్టపడతాడు ఆర్జీవి హారర్ మూవీస్ ని కూడా అంతే ఆసక్తిగా చూపిస్తాడు. నిజ జీవితానికి చాలా దగ్గరలో ఉండే చిత్రాలను తీయడం ఆర్జీవి స్పెషాలిటీ. క్షణక్షణం ,రంగీలా ,సత్య ,మనీ మనీ, గులాబి.. చిత్రాలు మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా విభిన్నమైన కాన్సెప్ట్లతో ట్రెండ్ సెట్టర్స్ గా నిలిచాయి.
బోయపాటి:
భద్ర మూవీతో టాలీవుడ్ లో అడుగు పెట్టాడు బోయపాటి. డైలాగుల్స్ ను వింటి నుంచి వదిలిన బాణాల మాదిరి సూటిగా గురి తప్పకుండా కాన్సెప్ట్ కన్వే చేసే విధంగా మలచడం బోయపాటి స్పెషాలిటీ. బోయపాటి సినిమా అంటే కామన్ గా ఉండేది ఒక భారీ కుటుంబం. ఇక హీరోకి అతని మూవీలో సాధ్యం కానిది అంటూ ఉండదు.. ఉరుములు ఒడిసి పట్టడం.. పిడుగులు గుద్దడం.. హీరో పసివాడిగా ఉన్నప్పటినుంచి చేయించే వెరైటీ డైరెక్టర్ బోయపాటి. ఇక అతను తీసిన చిత్రాల లో ఫ్యాక్షన్ కంటెంట్ కంటే కూడా.. హీరో మాసివ్ కంటెంట్ ఎక్కువగా కనిపిస్తుంది. లెజెండ్, సింహ, సరైనోడు ,జయ జానకి నాయక ,వినయ విధేయ రామ ,స్కంద లాంటి మూవీస్ బోయపాటి ట్రేడ్ మార్క్. ఇక ఈ మూవీస్ లో హీరోలు వాడే ఆయుధాలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి.
Also read: SRH New Captain: ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ మార్పు ? అందుకే అతడిని అంత ధరకు కొనుగోలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook