Silk Smitha Biopic: గ్లామరస్ తారగా, గ్రేట్ డ్యాన్సర్‌గా వెండితెరపై ఒకప్పుడు ఓ వెలుగు వెలిగారు సిల్క్ స్మిత (Silk Smitha). స్టార్ హీరోల సరసన అదిరిపోయే ఐటెం సాంగ్స్ చేసి చరిత్రలో నిలిచిపోయారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ సహా మరిన్ని భాషల్లో 400 సినిమాలకుపైగా చేశారు. 1979 నుంచి సుమారు 17 ఏళ్ల పాటు సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేశారు సిల్క్ స్మిత. ఒక ఏడాదిలో అత్యధిక సినిమాల్లో కనిపించిన బ్యూటీగా రికార్డు సృష్టించారు. అంతటి స్టార్ డమ్ తెచ్చుకున్న ఆమె వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో ఎదురైన చేదు సంఘటనల వల్ల 1996 సెప్టెంబర్ 23న ఆత్మహత్య చేసుకున్నారు.
తాజాగా సిల్క్ స్మిత జీవితం ఆధారంగా బయోపిక్ రానుంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ మూవీపై సిల్క్ స్మిత 63వ జయంతి సందర్భంగా డిసెంబరు 02న అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. సిల్క్ స్మిత ది అన్‌టోల్డ్ స్టోరీ’ పేరుతో రూపొందుతున్న ఈ బయోపిక్ లో సిల్క్ స్మిత పాత్రలో చంద్రిక రవి నటించనున్నారు. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. చంద్రికా రవి గతంలో వీర సింహారెడ్డి’లో ఓ స్పెషల్ సాంగ్ చేశారు. ఈ చిత్రానికి జయరామ్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్‍బీ విజయ్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆడియెన్స్ ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే సిల్క్ స్మిత జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో ‘డర్టీ పిక్చర్’ అనే మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో సిల్క్‌స్మితగా విద్యాబాలన్ నటించారు.
Happy 63rd birthday to the timeless beauty, Silk Smitha. With the blessings of her family, it is with immense gratitude that we share with the world her untold story@jayaram986@sivacherry@onlynikil@ursvamsishekar#happybirthdaysilk #silksmithabiopic #chandrikaassilk pic.twitter.com/hDbrs2ec0b
— 𝗖𝗵𝗮𝗻𝗱𝗿𝗶𝗸𝗮 𝗥𝗮𝘃𝗶 (@chandrikaravi_) December 2, 2023
Also Read: Animal Movie: బాక్సాఫీస్ వద్ద 'యానిమల్' ఊచకోత.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook