Health Tips: చలికాలం వచ్చింది అంటేనే ప్రతి ఇంట్లో ఏదో ఒక అనారోగ్య సమస్య కనిపిస్తూనే ఉంటుంది. జలుబు ,దగ్గు ,జ్వరాలతో పాటు కీళ్ల నొప్పులు ఈ సమయంలో ఎక్కువగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థ కూడా మందగిస్తుంది.. కాబట్టి చలికాలంలో చాలావరకు బరువు పెరిగే ఆస్కారం కూడా ఉంది. మరి వీటన్నిటికీ చక్కటి పరిష్కారం మన చేతుల్లోనే ఉంది అన్న విషయం చాలా మందికి తెలియదు.
నెయ్యి.. ఇది ఒక అద్భుతమైన సూపర్ ఫుడ్. ప్రతి ఇంట్లో కంపల్సరిగా ఉండే ఈ నేతిని ఉపయోగించి మనం బరువు తగ్గడం దగ్గర నుంచి చలికాలంలో తలెత్తే ఎన్నో సమస్యలను దూరం పెట్టవచ్చు. చలికాలంలో చల్లని గాలులు వీస్తాయి.. పైగా ఈ టైంలో క్లైమేట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది..దీంతో మనకు కూడా ఈజీగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా. అందుకే ఈ సీజన్ కొన్ని వస్తువులను కచ్చితంగా తీసుకోవాలి.మరి అవేమిటో ఎలాగో ఓ లుక్కేద్దాం పదండి..
సూపర్ ఫుడ్..
నెయ్యిని మన భారతీయ వంటలలో అనాదిగా ఉపయోగిస్తున్నారు. పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒకప్పుడు నూనె బదులు ఎక్కువగా నేతినే వంటకాలకు వాడేవారు. అంతేకాదు ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందుల తయారీకి నేతిని కూడా ఉపయోగిస్తారు. ఇన్ని సుగుణాలు కలిగిన నేతిలో విటమిన్ ఏ, ఇ ,డి పుష్కలంగా లభిస్తాయి. ఇది చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఉదర సంబంధిత ఎన్నో సమస్యలను తగ్గించి, ఎముకలను కూడా బలోపేతంగా చేస్తుంది.
కీళ్ల నొప్పులు మాయం:
చలికాలంలో తలెత్తే కీళ్ల నొప్పులు వాతావరణంలో వచ్చిన మార్పు కారణంగా వస్తాయి. ఈ నొప్పుల కారణంగా నడవాలన్నా ,కూర్చోవాలన్నా ఎంతో ఇబ్బంది ఎదురవుతుంది . రోజు పరగడుపున ఓ గ్లాసు గోరువెచ్చటి నీటిలో అర స్పూన్ నెయ్యి కలుపుకొని తాగడం వల్ల ఈ సమస్యలు క్రమంగా తగ్గుతాయి.
చర్మ సంరక్షణ:
చలికాలంలో చాలామందికి కాళ్లు ,చేతులు పగలడమే కాకుండా.. చర్మం పొడిగా, నిర్జీవంగా మారుతుంది. రోజు కాస్త నేతితో పొడిబారిన చర్మానికి మసాజ్ చేసి.. ఒక అరగంట తర్వాత స్నానం చేయడం వల్ల చర్మం కాంతివంతం అవ్వడమే కాకుండా ఎంతో ఆరోగ్యంగా తయారవుతుంది. ఇలా చర్మంపై నెయ్యితో మసాజ్ చేయడం వల్ల పలు చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి అని నిపుణులు చెబుతున్నారు.
మెరుగైన జీర్ణక్రియ :
ఈ సీజన్లో జీర్ణవ్యవస్థ కాస్త మందగిస్తుంది.. అందుకే మనం తీసుకునే భోజనం మొదటి ముద్దలో కాస్త నెయ్యి వేసి.. కరివేపాకు పొడి కలిపి తినడం వల్ల జీర్ణ సంబంధిత ఎన్నో సమస్యలు తగ్గుతాయి.
డిటాక్స్పై:
చలికాలంలో రోజు పొద్దున గోరువెచ్చటి నీటిలో కాస్త నెయ్యి కలుపుకుని తీసుకోవడం వల్ల శరీరంలోని విష పదార్థాలు సులభంగా బయటకు వెళ్తాయి. కడుపులో పేరుకుపోయిన కొవ్వు కరగడంతో పాటు మన శరీరం డిటాక్స్పై కూడా అవుతుంది.
Also Read: BRS-BJP Alliance: హంగ్ ఏర్పడితే బీఆర్ఎస్-బీజేపీ పొత్తు ఉంటుందా, అమిత్ షా ఏమంటున్నారు
Also Read: AB De Villiers Team: ఏబీ డివిలియర్స్ దృష్టిలో బెస్ట్ ప్రపంచకప్ టీమ్ ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook