Animal Trailer: అప్పుడు ప్రీతి పైన.. ఇప్పుడు నాన్న పైన.. మరోసారి సందీప్ వైలెంట్ ప్రేమ మార్క్

Animal: ప్రతి దర్శకుడికి తమదైన స్టైల్ ఉంటుంది. తన స్టైల్ ఏమిటో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తన మొదటి చిత్రం అర్జున్ రెడ్డి తోనే 100 శాతం చూపించారు. ఇప్పుడు తన స్టైల్ ని మరోసారి బీభత్సంగా చూపిస్తూ యానిమల్ సినిమాతో మన ముందుకి రాబోతున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 23, 2023, 02:48 PM IST
Animal Trailer: అప్పుడు ప్రీతి పైన.. ఇప్పుడు నాన్న పైన.. మరోసారి సందీప్ వైలెంట్ ప్రేమ మార్క్

Animal trailer : తన మొదటి సినిమా అర్జున్ రెడ్డి తోనే సెన్సేషన్ క్రియేట్ చేశారు సందీప్ రెడ్డి వంగ. ఇక అర్జున్ రెడ్డి తరువాత స్టార్ డైరెక్టర్ గా ఎదిగి మన తెలుగు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తారు అనుకుంటే.. తన తదుపరి సినిమా ఏకంగా బాలీవుడ్ లో చేసి అందరికీ షాక్ ఇచ్చారు. తనకు సూపర్ సక్సెస్ ఇచ్చిన అర్జున్ రెడ్డి సినిమా నే హిందీలో కబీర్ సింగ్ గా చేసి అక్కడ కూడా విజయం సాధించాడు.

ఇక కబీర్ సింగ్ సినిమా తర్వాత ఇప్పుడు ఏకంగా లవర్ బాయ్ రణబీర్ కపూర్ ని అగ్రెసివ్ హీరోగా చూపిస్తూ యనిమల్ సినిమాతో తెలుగు హిందీ ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైపోయాడు. ఈ సినిమా మొదటి లుక్ బయటకి వచ్చిన దగ్గర నుంచే ఈ చిత్రం పక్కా మరోసారి సందీప్ రెడ్డి మార్క్ చూపిస్తుందని అర్థమయిపోయింది.

అర్జున్ రెడ్డి సినిమా తోనే సందీప్ రెడ్డివంగా తాను హీరోని చాలా అగ్రెసివ్ గా.. వైలెంట్ గా.. చూపిస్తారు అని చెప్పకనే చెప్పాడు. సింపుల్ గా చెప్పాలి అంటే సందీప్ రెడ్డి.. హీరో అంటే దేనికైనా తెగించేవాడు.. అర్జున్ రెడ్డి చిత్రంలో ప్రీతి కోసం అర్జున్ రెడ్డి ఎంత దూరమైనా వెళ్తాడు.. ఏదైనా చేసేస్తాడు.. అలానే ఆ సినిమాని మొత్తం లాగారు ఈ డైరెక్టర్. ఇక ఈరోజు విడుదలైన యానిమల్ ట్రైలర్ చూస్తుంటే.. ఈ సినిమాలో తన ప్రియురాలి కోసం కాదు కానీ తన తండ్రి కోసం ఏదైనా చేసే పాత్రలో తన హీరోని చూపించారు సందీప్.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News