Atharva Release Date: ఏదైనా క్రైమ్ కేసు పరిష్కారించాలంటే కచ్చితంగా క్లూస్ ఉండాల్సిందే. ఎంతపెద్ద నేరస్తుడైనా ఎక్కడో అక్కడ చిన్న తప్పు చేస్తాడు. అయితే ఆ క్లూను కనిపెట్టాలంటూ సరైన ఆధారాలు కావాలి. క్రైమ్ కేసుల పరిష్కరాల్లో క్లూస్ టీమ్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఓ క్రిమినల్‌ను పట్టుకునే క్రమంలో క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్లు పడే కష్టాన్ని తెరపై చూపిస్తూ రూపొందిన చిత్రమే 'అథర్వ'. సస్పెన్స్, క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కినా అన్ని రకాల ఎమోషన్స్‌తో డిజైన్ చేశారు డైరెక్టర్ మహేష్ రెడ్డి. కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా యాక్ట్ చేశారు. పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుభాష్ నూతలపాటి నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీని డిసెంబర్ 1వ తేదీన ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. తాజాగా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని క్లూస్, ఫోరెన్సిక్ విభాగానికి స్పెషల్ షో వేశారు మూవీ మేకర్స్.
సినిమా చూసిన అనంతరం తెలంగాణ స్టేట్ ఫొరెన్సిక్ సైన్స్ లేబరేటరి అడిషనల్ డైరెక్టర్ డా.అనిత ఎవాంజెలిన్ మాట్లాడారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఈ క్లూస్ టీమ్ ఎంత ప్రముఖమైందో చూపించారని మెచ్చుకున్నారు. తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సినిమా తనకు చాలా నచ్చిందని.. తమ డిపార్ట్‌మెంట్ వాళ్లని హీరోల్లా చూపించారని అభినందించారు. ఫోరెన్సిక్, క్లూస్ డిపార్ట్‌మెంట్లు వేరు అని.. ఈ సినిమా తమ అందరికీ ఓ నివాళిలా అనిపించిందని చెప్పారు. తమ కష్టాన్ని ప్రజలు అందరికీ తెలిసేలా తీసిన ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.
హైదరాబాద్ సిటీ పోలీస్, క్లూస్ జాయింట్ డైరెక్టర్ డా.వెంకన్న మాట్లాడుతూ.. డైరెక్టర్ మహేష్ ఈ స్టోరీ తనకు ముందే చెప్పారని తెలిపారు. అయితే క్లూస్ డిపార్ట్మెంట్‌ను ఎలా చూపిస్తారా..? అని అనుకున్నానని.. సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని మెచ్చుకున్నారు. ఆరంభం నుంచి ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా తీశారని చెప్పారు. తాము రెగ్యులర్‌గా క్రైమ్ సీన్లను చూస్తుంటామని.. అందుకే ఆ జానర్‌లో తీసే చిత్రాలను పెద్దగా చూడమని అన్నారు. కానీ ఈ అథర్వ మూవీ మాత్రం అద్భుతంగా అనిపించిందన్నారు. క్రైమ్ సీన్ ఆఫీసర్ అంటే అథర్వలో కార్తీక్ రాజులా ఉండాలనేలా చూపించారని పేర్కొన్నారు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకంతో చెప్పారు.
అథర్వ మేకర్స్ మాట్లాడతూ.. సినిమాను దాదాపు వందకు పైగా క్రైమ్ సీన్ ఆఫీసర్లు చూశారని తెలిపారు. అందరికీ ఈ సినిమా తెగ నచ్చేసిందన్నారు. ప్రేక్షకులను సైతం మెప్పిస్తుందని నమ్మకంతో ఉన్నామని తెలిపారు. డిసెంబర్ 1న అథర్వ చిత్రాన్ని ఆడియన్స్ థియేటర్‌లో చూసి పెద్ద విజయాన్ని అందించాలని కోరారు.
Also Read: World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 విజేతకు రన్నర్ జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతంట
Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి