Ketu Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. అదే సమయంలో అత్యంత నష్టదాయక, పాపి గ్రహాలుగా భావించే రాహు, కేతువుల ప్రభావమైతే ఇంకా స్పష్టంగా ఉండనుంది. అయితే రాహు కేతువుల గోచారం ప్రతిసారీ నష్టాన్ని కాకుండా కొన్ని సందర్భాల్లో లాభదాయకంగా ఉంటుందంటున్నారు.
జ్యోతిష్యం ప్రకారం కేతువు కేతువు కన్యా రాశిలో గోచారముంది. దీనివల్ల ఆర్ధికంగా, సామాజికంగా ప్రయోజనాలు కలగనుండగా మానసికంగా మాత్రం ఒడిదుడుకులు ఎదుర్కోవల్సి వస్తుందంటారు. అక్టోబర్ 30న అంటే రేపు కేతువు కన్యా రాశిలో ప్రవేశించనున్నాడు. కన్యా రాశిలో ఏకంగా 18 నెలలపాటు అంటే మార్చ్ 2025 వరకూ ఉంటాడు. ఫలితంగా అన్ని రాశులపై ప్రభావం పడనుంది. ముఖ్యంగా వృషభ రాశి జాతకులపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
కేతువు కన్యారాశిలో ప్రవేశం కారణంగా వృషభ రాశి జాతకుల మానసిక స్థితి బలహీనం కానుంది. అనవసరమైన ఒడిదుడుకులు ఎదుర్కోవల్సివస్తుంది. ఆరోగ్యం విషయంలో పిల్లల విషయంలో ఆందోళన ఉండవచ్చు. అందుకే పిల్లల కెరీర్ విషయంలో సరైన ప్లానింగ్ అవసరం. చేసే ప్రతి పని ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయాలి. ఆవేశంతో ఏ నిర్ణయాలు తీసుకోకూడదు.
అయితే కెరీర్‌పరంగా ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. పరిశోధనారంగంలో ఉండేవారికి మంచి భవిష్యత్ ఉంటుంది. అదే సమయంలో అభివృద్ధి ఉంటుంది. డేటా భద్రత విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు. కీలకమైన కాగితాలు, ఇతర పత్రాలు భద్రంగా ఉంచుకోవాలి. పోగొట్టుకునే అవకాశాలు లేకపోలేదు. ఇక విద్యార్ధుల విషయానికొస్తే కష్టపడి చదివితే మంచి ఫలితాలు తప్పకుండా లభిస్తాయి. కేతువు కన్యా రాశిలో ఉన్నంతవరకూ అంటే ఈ 18 నెలలు విద్యార్ధులకు అనువైన సమయంగా పరిగణిస్తున్నారు.
ఇక ఆరోగ్యపరంగా ముందుగా చెప్పినట్టే సమస్యలు ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా ఇంట్లో పెద్దవారి ఆరోగ్యంపై చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా వ్యాధి తగ్గకుండా బాధిస్తుంటే ఇతర వైద్యుల సలహాలు కూడా తీసుకోవాలి. కడుపు సంబంధిత సమస్యలు వెంటాడవచ్చు. వ్యాపారులకు చాలా అనువైన సమయం. ఊహించని లాభాలు కలుగుతాయి. అదే సమయంలో వ్యాపారం విస్తృతమౌతుంది.
Also read: Horoscope: ఈ వారం 5 రాశుల వారికి మిశ్రమ ప్రయోజనాలు..ఈ వారం జరగబోయేది ఇదే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook