AP Rains Alert: ఏపీలో మళ్లీ వర్షాలు పడనున్నాయి. పశ్చిమ మద్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తేమతో కూడిన గాలులు వీస్తున్నాయి. అదే సమయంలో తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతుండటంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలో ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఇవాళ తేలికపాటి వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గుంటూరు, బాపట్ల, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ వెల్లడించింది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా పెరుగుతోంది. రాత్రి వేళ ఉష్ణోగ్రత పడిపోతోంది. ఏజెన్సీ ప్రాంతంలో పరిస్థితి తీవ్రంగా ఉంది. తెలంగాణలో రాత్రి వేళ కనిష్టంగా 19 డిగ్రీల సెల్సియస్ నమోదవుతోంది. తెలంగాణలో పగటి వేళ 31 శాతం తేమ ఉంటుంది. ఏపీలో మద్యాహ్నం వేళ 57 శాతం ఉంటుంది.
Also read: Ap Voters List: ఏపీ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల, మార్చ్ 2024లో ఎన్నికల నోటిఫికేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook