Rahu Ketu Transit Effects: రాహు- కేతు గ్రహాల సంచారం కారణంగా ఈ రాశుల వారికి జరగబోయేది ఇదే..

Rahu Ketu Transit Effects: చాలా రోజుల తర్వాత రాహు కేతు గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావం వల్ల ఏ రాశి వారికి ఏం జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 22, 2023, 11:07 AM IST
Rahu Ketu Transit Effects: రాహు- కేతు గ్రహాల సంచారం కారణంగా ఈ రాశుల వారికి జరగబోయేది ఇదే..

 

Rahu Ketu Transit Effects: ఈ సంవత్సరంలోని చివరి చంద్రగ్రహణం అక్టోబర్ 28వ తేదీన ఏర్పడబోతోంది. ఇది భారతదేశ వ్యాప్తంగా కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి సూతక కాలం చెల్లుబాటు అవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే చంద్రగ్రహణం ఏర్పడిన ఒక్కరోజు తర్వాతే రాహు కేతు గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. రాహు కేతు గ్రహాలు అక్టోబర్ 30వ తేదీన మీన రాశి నుంచి కన్యారాశిలోకి సంచారం చేయబోతున్నాయి.

ఈ సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలిగితే మరికొన్ని రాశుల వారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ గ్రహాల ప్రభావం నేరుగా వ్యక్తిగత జీవితాల పై పడి కొన్ని రాశుల వారికి అదృష్టం తగ్గితే, మరికొన్ని రాశుల వారికి అదృష్టం పెరిగి ఊహించని లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. శుభ, అశుభ ప్రభావాలు జాతక స్థానాల్లో జరగబోయే సంచారాలను బట్టి ఆధారపడి ఉంటుంది. కేతువు రాహుకేతు గ్రహాలు జాతకంలో అనుకూల స్థానంలో సంచారం చేస్తే అదృష్టం పెరుగుతుంది అదే ప్రతికూల స్థానాల్లో సంచారం చేయడం కారణంగా దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

మేష రాశి:
మేష రాశి వారు రాహు కేతు గ్రహాల సంచారం కారణంగా ఏదో తెలియని భయంతో చాలా ఇబ్బంది పడే అవకాశాలున్నాయి. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సంచారాల కారణంగా మీ స్నేహితుల మద్దతు లభించి వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుతారు. 

Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  

వృషభ రాశి:
వృషభ రాశి వారు ఈ సమయంలో ఎంతో ఓపికతో ఉండడం చాలా మంచిది. అవసరమైన కోపాన్ని తగ్గించుకోవడం చాలా మంచిది. లేకపోతే వివాదాల వలన అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక విద్యార్థులైతే ఈ సమయంలో పోటీ పరీక్షల్లో గొప్ప విజయాలు సాధిస్తారు. దీంతోపాటు వీరు స్నేహితుల నుంచి బహుమతులు కూడా పొందవచ్చు. ఈ రాశి వారికి తల్లిదండ్రుల మద్దతు కూడా లభిస్తుంది.

మిథున రాశి:
మిధున రాశి వారికి మాటల్లో మాధుర్యం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఉద్యోగాలు చేసే వారికి కొన్ని ఊహించని సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో వీరు అదనపు ఖర్చులకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఇక వృత్తి జీవితాన్ని కొనసాగిస్తున్న వారు హార్డ్ వర్క్ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.  అంతేకాకుండా మనస్సు కూడా సంతోషంగా మారుతుంది. కర్కాటక రాశి ఈ సమయంలో కోపాన్ని నియంత్రించి ఉంటే చాలా మంచిది లేకపోతే సంభాషణలో అసౌకర్యాలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతోపాటు వీరికి ఉద్యోగాల్లో మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. ఈ రాశి వారు కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు ఇదే సరైన సమయం గా భావించవచ్చు.

సింహ రాశి:
సింహరాశి వారికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా సహనం తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆదాయం పెరిగి ఖర్చులు కూడా తగ్గుతాయి. వాటి వీరు విదేశీ పర్యటనలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సమయంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు రావచ్చు.

Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News