Chandrababu Case Updates: స్కిల్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అదినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. సుదీర్ఘ వాదనల అనంతరం బెయిల్ పిటీషన్, సీఐడీ కస్టడీ పిటీషన్ రెండింటినీ కోర్టు కొట్టివేసింది.
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇవాళ సోమవారం అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, అంగళ్లు కేసు, ఏపీ ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటీషన్లపై ఇటీవలే ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసి ఇవాళ వెలువరించింది. మూడు కేసుల్లోనూ చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.
మరోవైపు ఏపీ స్కిల్ కేసులో చంద్రబాబు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. అదే సమయంలో చంద్రబాబును మరోసారి కస్టడీకు ఇవ్వాలంటూ సీఐడీ పిటీషన్ దాఖలు చేసింది. ఈ రెండు పిటీషన్లపై ఏసీబీ కోర్టులో సుదీర్ఘ వాదనల అనంతరం తీర్పు రిజర్వ్ చేసింది. ఇవాళ ఏసీబీ కోర్టు చంద్రబాబు బెయిల్ పిటీషన్, సీఐడీ కస్టడీ పిటీషన్లపై తీర్పు వెలువరించింది. చంద్రబాబు బయటకు వస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారని, విచారణ కీలకదశలో ఉన్నందున బెయిల్ ఇవ్వవద్దని సీఐడీ చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది. బెయిల్ పిటీషన్‌ను తిరస్కరించింది. మరోవైపు మరోసారి కస్టడీ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటీషన్‌ను కూడా ఏసీబీ కోర్టు కొట్టివేసింది.
మొత్తానికి అటు హైకోర్టులో, ఇటు ఏసీబీ కోర్టులో రెండింట్లోనూ చంద్రబాబుకు చుక్కెదురైంది. బెయిల్ పిటీషన్లను రెండు కోర్టులు తిరస్కరించాయి. మరోవైపు చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై మాత్రం సుప్రీంకోర్టులో వాదనలు హోరాహోరీగా జరుగుతున్నాయి.
Also read: AP CM YS Jagan: పార్టీ నేతలకు జగన్ దిశా నిర్దేశం, ఎన్నికలెప్పుడో క్లారిటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook